భారతదేశపు అగ్రశ్రేణి బిలియనీర్ ముఖేష్ అంబానీ, తన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా కొత్త దిశగా మలుపు తిప్పారు. చమురు నుంచి డేటా వైపు, ఎనర్జీ నుంచి ఇంటెలిజెన్స్ వైపు.. ఇదే అంబానీ తాజా విజన్ అని చెప్పవచ్చు. ఆయన లక్ష్యం స్పష్టంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతిక విప్లవం ద్వారా రిలయన్స్‌ను ప్రపంచ స్థాయి డీప్-టెక్ దిగ్గజంగా మార్చడం. ఈ ప్రణాళికలో దాదాపు 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి ఉండగా.. మార్కెట్ ఈ AI వెంచర్‌ను 30 బిలియన్ డాలర్ల విలువకు చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వ్యూహాత్మక పివోట్‌కి కేంద్రంగా Reliance Enterprise Intelligence Limited (REIL) అనే కొత్త యూనిట్ నిలిచింది. ఈ సంస్థలో రిలయన్స్ 70 శాతం వాటా, టెక్ దిగ్గజం మెటా (Facebook మాతృసంస్థ) 30 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రారంభంగా రూ. 855 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ ఎంటర్‌ప్రైజ్ AI సేవలను అభివృద్ధి చేయడం, మార్కెట్ చేయడం, పంపిణీ చేయడం వంటి పనులను చేపట్టింది. ఇది అంబానీ AI దిశలో మొదటి నిజమైన అడుగు అని చెప్పవచ్చు. బోర్డు గదుల చర్చల నుంచి బ్యాలెన్స్ షీట్‌కి చేరిన కీలక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు.

15 బిలియన్ డాలర్ల AI మౌలిక సదుపాయాల నిర్మాణం: మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, రిలయన్స్ 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన భారీ డేటాసెంటర్‌ను నిర్మించడానికి 12 నుంచి 15 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. ఈ డేటాసెంటర్‌లో 25 శాతం సామర్థ్యాన్ని రిలయన్స్ స్వయంగా ఉపయోగించుకోగా.. మిగతా భాగాన్ని హైపర్‌స్కేలర్లు, LLM ప్రొవైడర్లు వంటి ప్రపంచ టెక్ కంపెనీలకు సర్వీస్‌గా డేటాసెంటర్ మోడల్‌లో లీజుకు ఇవ్వనుంది.
30 బిలియన్ డాలర్ల విలువ: మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు పేర్కొన్నట్లు ఈ పెట్టుబడులపై సుమారు 11% ROCE (Return on Capital Employed) వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ డేటాసెంటర్ కంపెనీల విలువలను పరిశీలిస్తే, రిలయన్స్ AI విభాగం కనీసం 2x Price-to-Book విలువను సాధించవచ్చని అంచనా. అంటే 2027 నాటికి ఈ AI వేదిక ఒక్కటే 30 బిలియన్ డాలర్ల విలువను సృష్టించగలదని అంచనా వేస్తున్నారు.
డ్యూయల్ వ్యూహం: అంబానీ వ్యూహం ద్వంద్వ దిశలో నడుస్తోంది. ఒకవైపు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో భాగస్వామ్యాలు, మరోవైపు అదే కంపెనీలతో AI ఉత్పత్తుల రంగంలో పోటీ.
రిలయన్స్ జియో టెలికాం విభాగం ఈ టెక్ దిగ్గజాల సర్వీసులను వినియోగించుకోగా, Reliance Intelligence మాత్రం ఎంటర్‌ప్రైజ్ స్థాయిలో తమకంటూ ప్రత్యేక AI ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందిస్తోంది. ఇది ఒక రకంగా సహకార-పోటీ (Co-opetition) వ్యూహం.అలాగే మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం, కానీ మార్కెట్‌లో పోటీ.
జామ్‌నగర్ - కొత్త డేటా రాజధాని: ఈ AI పివోట్ యొక్క భౌతిక రూపం జామ్‌నగర్ లో కనిపిస్తోంది. ఇక్కడ రిలయన్స్ ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నడిచే గిగావాట్-స్కేల్ డేటాసెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది రిలయన్స్ యొక్క పాత ఆయిల్ రిఫైనరీ సముదాయానికి పక్కనే ఉండటం విశేషం.గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో ప్రత్యేక AI-కేంద్రీకృత క్లౌడ్ జోన్ ను స్థాపించనున్నారు. ఇక్కడే రిలయన్స్ AI, క్లీన్ ఎనర్జీ, డేటా ప్రాసెసింగ్-all-in-one విధానంలో సమ్మేళనం అవుతుంది.
AI విప్లవం.. రిలయన్స్‌కి నాలుగవ అంకం: రిలయన్స్ ఇప్పటికే చమురు, రిటైల్, టెలికాం రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు AI పివోట్‌ద్వారా నాలుగవసారి మార్కెట్‌ను మార్చే ప్రయత్నం చేస్తోంది. ముఖేష్ అంబానీ ఇటీవల AGMలో చెప్పినట్లుగా ఒక దశాబ్దం క్రితం, డిజిటల్ సేవలు రిలయన్స్‌కి కొత్త వృద్ధి ఇంజిన్‌గా మారాయి. ఇప్పుడు AIతో వచ్చే అవకాశం మరింత పెద్దది. అంటే, చమురు రిలయన్స్ సామ్రాజ్యానికి నల్ల బంగారం అయితే, AI దాని కొత్త తెల్ల బంగారంగా మారబోతోంది.
మార్కెట్ రిలయన్స్ AI వెంచర్‌ను 30 బిలియన్ డాలర్ల విలువ చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానం దాని అమలు సామర్థ్యంపైనే ఆధారపడి ఉంది. ఇంధన మౌలిక సదుపాయాలు, టెలికాం నెట్‌వర్క్, మరియు పెట్టుబడి శక్తిని సమర్థంగా ఉపయోగించుకుంటే, రిలయన్స్ భారతదేశ AI ఎకోసిస్టమ్‌కి వెన్నెముక గా మారే అవకాశం ఉంది.అంబానీ AIలో పెట్టిన ఈ భారీ పందెం విజయవంతమైతే, ఇది రిలయన్స్‌కి కొత్త జియోలా, భారత టెక్ ప్రపంచానికి కొత్త విప్లవంగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications