Mukesh Ambani: బడ్జెట్ ప్రసంగం రోజున భారీగా నష్టపోయిన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు వరుసలో నిలిచింది. దీంతో భారీగా సంపదను కోల్పోయిన వ్యాపారవేత్తగా ముఖేష్ అంబానీ నిన్న ఉన్నారు. అయితే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనేందుకు మార్కెట్లలో ఇన్వెస్టర్లు పోటీపడటం సంచలనంగా మారింది.
ఆసియాలో సంపన్నుడిగా ఉన్న వ్యాపారవేత్ ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి అమెరికా నుంచి శుభవార్త వచ్చింది. దీంతో నేడు ఇంట్రాడేలో రిలయన్స్ షేర్లు నిన్నటి పతనం నుంచి కోలుకుంటున్నాయి. మార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి భారీ కొనుగోళ్లకు డిమాండ్ పెరగటంతో మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో 0.39 శాతం లాభంతో రూ.2987 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. దీనికి ముందు ఉదయం 11 గంటలకు రిలయన్స్ స్టాక్ సెన్సెక్స్‌లో ఒక శాతం కంటే ఎక్కువ లాభంతో రూ.3005 వద్ద ట్రేడైంది. దీని వెనుక ఉన్న కారణాన్ని పరిశీలిస్తే ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు కలిగి ఉన్న వెనిజువెలా నుంచి ముడి చమురు దిగుమతి పునఃప్రారంభానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యూఎస్ ఆంక్షలు ఉన్నప్పటికీ వెనిజువెలా నుంచి చమురు దిగుమతులను పునఃప్రారంభించేందుకు రిలయన్స్ ఆమోదాన్ని పొందిందని వెల్లడైంది. దీంతో భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రిఫైనర్ త్వరలో వెనిజువెలా నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాలని యోచిస్తోంది. అమెరికా ట్రెజరీ ఈ అప్‌డేట్‌పై వ్యాఖ్యానించడానికి నిరాకరించగా, రిలయన్స్ సైతం ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన వెలువరించలేదు. వాస్తవానికి గత సంవత్సరం వెనిజులా నుంచి భారత ముడి దిగుమతుల్లో రిలయన్స్ వాటా 90%గా ఉంది.
అధ్యక్షుడు నికోలస్ మదురో, ప్రతిపక్షాలు స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికలకు హామీ ఇచ్చే ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత చమురుపై ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేయబడ్డాయి. వెనిజువెలా ఒప్పందాన్ని గౌరవించనందున ఏప్రిల్‌లో ఆంక్షలు మళ్లీ విధించబడ్డాయి. దీంతో చమురు కంపెనీలు అక్కడ ట్రేడింగ్ కొనసాగించడానికి US ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్‌తో పాటు భారతదేశ ప్రభుత్వ ఆధీనంలోని చమురు, సహజ వాయువు సంస్థ ONGC విదేశ్ లిమిటెడ్ కూడా వెనిజువెలా నుంచి ముడి చమురు దిగుమతికి మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకుంది.
షిప్పింగ్ నివేదికలు, Kpler డేటా ప్రకారం జూన్‌లో వెనిజువెలా క్రూడ్ ఎగుమతులు రోజుకు 654,000 బ్యారెళ్లకు పెరిగాయి. ఏప్రిల్ 2020 తర్వాత ఇదే అత్యధికం. ఎందుకంటే ఆంక్షలు ఉన్నప్పటికీ డ్రిల్లింగ్‌ను కొనసాగించడానికి కంపెనీలకు అమెరికా నిర్దిష్ట లైసెన్స్ ఇవ్వటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications