Jio 5G plans: భారతదేశ టెలికాం రంగంలో 4జీ ప్రవేశపెట్టి పెద్ద విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త యుద్ధానికి తెరలేపింది. అయితే అంబానీ ఈసారి సైలెంట్ గా 5జీ వ్యాపారాన్ని దక్కించుకునేందుకునే ప్రణాళికతో వినియోగదారుల వద్దకు వచ్చారు.
వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ జియో నిశ్శబ్దంగా మూడు కొత్త ట్రూ అన్ లిమిటెడ్ అప్‌గ్రేడ్ ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వినియోగదారులకు అపరిమిత 5G డేటాకు మరింత సరసమైన ప్రాప్యతను అందిస్తోంది. ఈ కొత్త బూస్టర్ ప్యాక్‌లు రూ. 51, రూ. 101, రూ. 151 ధరలతో వీటిని ప్రస్తుతం ఉన్న ప్లాన్లతో కలిపి కొనుగోలు చేసేందుకు జియో అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవల టారిఫ్ పెంపుల తర్వాత జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అపరిమిత 5G డేటాను యాక్సెస్ చేయడానికి థ్రెషోల్డ్‌ని పెంచింది. దీంతో ఇప్పుడు రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్‌లు మాత్రమే అపరిమిత 5G పొందటానికి అర్హులుగా కంపెనీ నిర్ణయించింది.

అయితే కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన అపరిమిత అప్‌గ్రేడ్ ప్లాన్‌లు రోజుకు 1జీబీ, 1.5 జీబీ డేటా ప్లాన్స్ ఉన్న వ్యక్తులు సైతం 5జీ సేవలను ఆస్వాదించడానికి అనుమతిస్తాయి. ప్లాన్ ప్రయోజనాలను గమనిస్తే.. రూ.51 ప్లాన్‌లో 3GB 4G డేటా, అపరిమిత 5G అందిస్తోంది. ఇక రూ.101 ప్లాన్ కింద అపరిమిత 5Gతో పాటు 6GB 4G డేటాను అందించబడుతోంది. చివరిగా రూ.151 ప్లాన్ 9GB 4G డేటాతో పాటు అపరిమిత 5Gని అందిస్తుంది. ఈ ప్లాన్స్ కొనసాగుతున్న ప్లాన్ వ్యాలిడిటీ వరకు పనిచేస్తాయి. ఈ క్రమంలో కంపెనీ రూ.61 ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
గతంలో వినియోగదారులు రూ.239 లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో Jio వెల్‌కమ్ ఆఫర్‌ని అందించేది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ ధర రూ.60 పెంచబడటంతో పాటు అపరిమిత 5G ప్రయోజనాన్ని ప్లాన్ నుంచి కంపెనీ తొలగించింది. దీని కారణంగా జియో వినియోగదారులు ఇకపై అపరిమిత 5Gని యాక్సెస్ చేయడానికిఅధిక ధర గల ప్లాన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ మార్పులు జియో తన 5G ఆఫర్‌లలో వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తాయి.
ఈ కొత్త బూస్టర్ ప్యాక్‌లను పరిచయం చేయడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులు మరింత 5G కనెక్టివిటీ ప్రయోజనాలను అనుభవించేలా కంపెనీ ప్రోత్సహిస్తోంది. వారితో ఎక్కువ ఖర్చు చేయించేందుకు ఇప్పుడు 2GB/రోజుకు లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో అపరిమిత 5Gని జియో అందిస్తోంది.


Click it and Unblock the Notifications