Reliance Industries: దేశంలోని అగ్రవ్యాపారవేత్తల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ప్రస్తుతం తన వ్యాపారాన్ని మరింత వేగంగా ముందుకు నడిపించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లపై నేరుగా ప్రభావితం చూపనున్నాయి.
తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విదేశీ రుణాన్ని పొందటం గురించి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 11 బ్యాంకుల కన్సార్టియం నుంచి 3 బిలియన్ డాలర్లను సమీకరించిందని విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గడచిన రెండేళ్లుగా రిలయన్స్ చేసుకున్న రుణ ఒప్పందాల్లో ఇది పెద్దది కావటం గమనార్హం. ఇది మూడు నెలల సెక్యూర్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేట్ కంటే 120 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటుతో తీసుకోబడుతుంది. ఇందులో జపాన్ యెన్‌లో 450 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందింది. డిసెంబర్‌లో మూడు నెలల SOFR రేటు 4.80 శాతంపై వడ్డీ 120 బేసిస్ పాయింట్లతో 6 శాతం ఉంటుంది.

వాస్తవానికి 2025లో గడువు ముగుస్తున్న రుణ రీఫైనాన్సింగ్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్ల రుణాన్ని సమీకరించినట్లు వెల్లడైంది. కంపెనీ ఇప్పటికే 700 మిలియన్ డాలర్ల రుణాన్ని ఉపయోగించుకుంది. ఇదే క్రమంలో ప్రస్తుత త్రైమాసికంలో అవసరమైన మేరకు మరిన్ని నిధులను సేకరించాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ఏఏ బ్యాంకుల నుంచి ఎంత రుణాన్ని తీసుకుందనే విషయాన్ని పరిశీలిస్తే..
- బ్యాంక్ ఆఫ్ అమెరికా 343 మిలియన్ డాలర్లు
- డీబీఎస్ బ్యాంక్ 300 మిలియన్ డాలర్లు
- హెచ్ఎస్బీసీ బ్యాంక్ 300 మిలియన్ డాలర్లు
- జపాన్ కు చెందిన ఎమ్యూఎఫ్జీ 280 మిలియన్ డాలర్లు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 275 మిలియన్ డాలర్లు
- స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 250 మిలియన్ డాలర్లు
- మిజుహో బ్యాంక్ 250 మిలియన్ డాలర్లు
- SMBC బ్యాంక్ 250 మిలియన్ డాలర్లు
రిలయన్స్ వ్యాపారం..
గత ఏడాది కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన తర్వాత తాజా పరిణామాలు కొనసాగుతున్నాయి. గడచిన 5 ఏళ్లలో రెన్యూవబుల్ ఎనర్జీ, టెలికాం, రిటైల్ అండ్ మీడియా వ్యాపారాల్లో కొనుగోళ్లకు సుమారు 13 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కంపెనీ ప్రస్తుతం చమురు వ్యాపారం నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మారాలని చూస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications