Reliance Industries: అంబానీకి అప్పులివ్వటానికి క్యూకట్టిన బ్యాంకులు, పూర్తి వివరాలివే..
Mukesh Ambani: డిసెంబర్ నెల మధ్యలోకి రావటంతో మరికొన్ని వారాల్లోనే 2024 పూర్తి కాబోతోంది. ఈ క్రమంలో ఆసియాలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సరికొత్త వ్యాపార ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబానీ అతిపెద్ద అప్పుకోసం సన్నాహాలు చేస్తున్నారు.
అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అవసరాల కోసం డబ్బును రుణాల రూపంలో తీసుకోవటం ఇదే తొలిసారి కాదు. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 3 బిలియన్ డాలర్ మేర రుణం కోసం బ్యాంకులతో చర్చలు కొనసాగిస్తోందని సమాచారం. అయితే ఒకే ఏడాదిలో ఇండియా నుంచి ఏదైనా సంస్థ పొందిన అతిపెద్ద రుణమెుత్తంగా ఇది నిలవనుంది. ఈ క్రమంలో అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి రుణాలను అందించటానికి డజను బ్యాంకులు చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలకు సంబంధించిన వివరాలు అజ్ఞాతంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. రుణ చర్చలపై రిలయన్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం భారతదేశ సావరిన్ గ్రేడ్ కంటే ఒక నాచ్ పైన రేట్ చేయబడింది. ఏదైనా ఒక కంపెనీకి అది ఉన్న దేశం కంటే ఎక్కువ ఖ్యాతిని కలిగి ఉన్నప్పుడు ఇలా జరుగుతుంటుంది. గడచిన వారం ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను Baa2 వద్ద పునరుద్ఘాటించినట్లు పేర్కొంది. కంపెనీ క్రెడిట్ మెట్రిక్‌లు "పటిష్టంగా" ఉన్నట్లు అందులో పేర్కొంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ వడ్డీ చెల్లింపులతో సహా 2025లో సుమారు 2.9 బిలియన్ డాలర్ల రుణాన్ని కలిగి ఉందని వెల్లడించబడింది.
ఒకవేళ రుణం సదరు బ్యాంకుల నుంచి ఆమోదం పొందినట్లయితే తిరిగి రిలయన్స్ ఆఫ్‌షోర్ మార్కెట్‌కు తిరిగి వచ్చినట్లు గుర్తించబడుతుంది. 2023 సమయంలో రిలయన్స్ గ్రూప్ దాదాపు 8 బిలియన్ డాలర్లను ఇదే తరహాలో రుణాలను సేకరించి పెద్ద రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ ఆగస్టులో వాటాదారులతో మాట్లాడుతూ రిలయన్స్ గ్రూప్ దశాబ్దం ముగిసేలోపు రెండింతలు అయ్యేందుకు ట్రాక్ లో ఉన్నట్లు చెప్పారు.
ఈ క్రమంలో గ్రూప్ తన వ్యాపారాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు సైతం అంబానీ స్టేక్ హోల్డర్లకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రుణాల కోసం చర్చల అంశంపై రాయిటర్స్ స్పష్టతను రిలయన్స్ గ్రూప్ నుంచి కోరగా ఇప్పటి వరకు వారు స్పందించలేదని వెల్లడైంది. అయితే కొత్త ఏడాదిలో దీనికి సంబంధించిన ప్రకటన ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications