Mukesh Ambani: అంబానీ చేతికి మరో కంపెనీ.. అనుమతి ఇచ్చిన ఎన్‌సీఎల్‌టీ..
Reliance Industries: దేశంలోని ప్రఖ్యాత వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి రిలయన్ ఇండస్ట్రీస్. దీనికి ముకేష్ అంబానీ ప్రాతినిత్యం వహిస్తున్నారు. ఆసియాలోని అతిపెద్ద వ్యాపారవేత్త ఇటీవల తన వ్యాపారాలను వేగంగా వృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో దివాలా తీసిన మరో కంపెనీ ఆయన వ్యాపారాల్లోకి వచ్చి చేరింది.

ఎన్‌సీఎల్‌టీ అంగీకారం..
రుణ భారంతో ఉన్న టెక్స్‌టైల్ కంపెనీ సింటెక్స్ ఇండస్ట్రీస్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL), అసెట్స్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్(ACRE) సంయుక్తంగా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంగీకరించింది. దీంతో అంబానీ ఒడిలో మరో కంపెనీ వచ్చి చేరింది.

సింటెక్స్ వ్యాపారం..
సింటెక్స్ ఇండస్ట్రీస్ అనేక దిగ్గజ బ్రాండ్లకు ఫాబ్రిక్‌ను సరఫరా చేస్తుంది. వీటిలో అర్మానీ, హ్యూగో బాస్, డీజిల్, బుర్బెర్రీ కూడా ఉన్నాయి. రిలయన్స్ సింటెక్స్ డీల్ కింద ఈక్విటీ షేర్ల డీలిస్టింగ్ కూడా ఉంది. RIL-ACRE సంయుక్తంగా సుమారు రూ.3,650 కోట్ల ఆఫర్ చేశాయని తెలుస్తోంది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌కు రుణదాతలు RIL-ACRE ఉమ్మడి బిడ్‌కు అనుకూలంగా ఓటు వేశారు.

దివాలా ప్రక్రియ..
సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై దివాలా ప్రక్రియ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైంది. కంపెనీని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు వెల్స్పన్ గ్రూప్ కూడా పోటీలో నిలిచింది. అయితే సింటెక్స్ రుణదాతలు మాత్రం చివరికి RIL-ACRE ఉమ్మడి బిడ్‌కు అనుకూలంగా ఓటు వేశారు.
దీంతో NCLT సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రుణదాతల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో అమిత్ పటేల్ ప్రమోట్ చేసిన సింటెక్స్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ లిమిటెడ్ సింటెక్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిపోయింది. Sintex Plastics Technology Ltd వాటర్ ట్యాంకులను తయారు చేస్తోంది.


Click it and Unblock the Notifications