Dunzo: ముకేష్ అంబానీ పెట్టుబడులు పెట్టిన బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ డన్జో సంక్షోభంలో ఉంది. రోజురోజుకూ లోపల పరిస్థితులు చేజారిపోతున్నాయి. నిధుల కొరతతో కంపెనీ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
ఈ క్రమంలో మూడోసారి 30 శాతం ఉద్యోగుల కోతలకు వెళ్లాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే చాలా మందికి కంపెనీ జీతాలు చెల్లించటంలో ఆలస్యం చేస్తోందని వెల్లడైంది. జూన్, జూలై నెలల జీతాల చెల్లింపును మరింత ఆలస్యం అవుతాయని ఉద్యోగులకు రాసిన నోట్‌లో కంపెనీ పేర్కొంది. జూన్‌కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇప్పుడు సెప్టెంబర్ 4, 2023న చెల్లించబడతాయని వెల్లడైంది.

కన్వర్టిబుల్ నోట్స్ ద్వారా కంపెనీ 75 మిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు కొరతతో కంపెనీ ఇబ్బంది పడుతున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో.. డన్జో చెల్లించని రూ.4 కోట్ల బకాయిలపై ఫేస్‌బుక్, సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ సంస్థ నీలెన్సో లీగల్ నోటీసులు పంపాయి. ఫేస్‌బుక్ కు కొంత చెల్లింపులు చేసినప్పటికీ ఇంకా రూ.1.50 కోట్లు చెల్లించాల్సిన బకాయి ఉందని సమచారం. ఇదే క్రమంలో బెంగళూరుకు చెందిన సహకార సంస్థకు రూ.కోటి చెల్లించిన తర్వాత.. ఇప్పటికీ దాదాపు రూ.2.5 కోట్లు బకాయి ఉన్నట్లు తేలింది.
2015లో స్థాపించబడిన Dunzo.. Reliance, Google, Lightrock, Lightbox, Blume Venturesతో పాటు ఇతరుల నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించాయి. అయితే కంపెనీ లాభాలను ఆర్జించటంలో చాలా వెనుకపడిందని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ పనితీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్థాపకులు నిధులను సేకరిస్తున్నప్పటికీ వాటిని లాభాలు ఆర్జించే విధంగా మలచలేకపోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications