Mukesh Ambani: దేశంలో అత్యంత ప్రఖ్యాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యాన్ని అంబానీ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలో జియో వరల్డ్ ఫ్లాజా పేరిట మెగా మాల్ ఒకటి నిర్మించారు. ఇప్పుడు ఇది వార్తల్లో ప్రధానంగా నిలిచింది.
జియో వరల్డ్ ప్లాజాతో రిటైల్ వ్యాపారంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతోంది. దేశంలోనే అత్యంత విలాసవంతమైన, ప్రత్యేకమైన షాపింగ్ మాల్ కాంప్లెక్స్‌లలో ఒకటిగా ఇది ఉంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య హబ్‌లో ఇప్పటికే చాలా లగ్జరీ బ్రాండ్‌లు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. ఇప్పటికే గూచీ, కార్టియర్, లూయిస్ విట్టన్ వంటి లగ్జరీ బ్రాండ్లు లీజు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలుస్తోంది.

జియో వరల్డ్ ప్లాజా ఈ సంవత్సరం ఎప్పుడైనా తెరవబడుతుందని రాయిటర్స్ వార్తా కథనం వెల్లడించింది. లూయిస్ విట్టన్, గూచీ, కార్టియర్, బుర్బెర్రీ, బల్గారి, డియోర్, IWC షాఫ్‌హౌసెన్, రిమోవా, రిచెమాంట్ వంటి బ్లాండ్లతో పాటు కెరింగ్ ఆధ్వర్యంలో.. Balenciaga, Bottega Veneta, Yves Saint Laurent, Creed, Alexander McQueen వంటి అనేక ఫ్రెంచ్ బ్రాండ్‌లు ముంబైలోని జియో వరల్డ్ ప్లాజా ద్వారా దేశంలో తమ మొదటి మాల్ అవుట్‌లెట్‌లను ప్రారంభించనున్నాయి.
ఇక ఈ లగ్జరీ మాల్‌లో అద్దె విషయానికి వస్తే భారీగానే ఉంది. జియో వరల్డ్ ప్లాజాలో లూయిస్ విట్టన్, గూచీ వంటి బహుళ లగ్జరీ బ్రాండ్‌ల లీజు, వారు మాల్‌లో దుకాణాన్ని నడపడానికి 9 ఏళ్లకు పైగా ఒప్పందం కుదుర్చున్నాయని సమాచారం. అయితే ఇక్కడ షాపు అద్దె నెలకు ఏకంగా రూ.40.50 లక్షలుగా ఉందన్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ మాల్ నవంబర్ లేదా డిసెంబర్‌లో రిలయన్స్ గ్రూప్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications