Jio News: కొత్త సంవత్సరం ఆఫర్ల వర్షం కురిపిస్తున్న జియో.. అన్‍లిమిటెడ్ 5జీ నుంచి ఉచితాల వరకు..
Jio New Year Welcome Plan: 2024లో అంబానీకి చెందిన టెలికాం వెంచర్ జియో గట్టిపోటీని ఎదుర్కొంది. ప్రధానంగా అనంత్ వివాహం తర్వాత పెంచిన టారిఫ్ రేట్లు కంపెనీకి ఆదాయాన్ని పెంచుతాయని భావించగా భారీగా వినియోగదారులు కోల్పోవటానికి దారితీసింది. ఈ క్రమంలో ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ నుంచి పెద్ద పోటీని ఎదుర్కొంది.
అయితే జియో డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ప్రస్తుతం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న వేళ యూజర్లను ఆకట్టుకునే న్యూఇయర్ వెల్కమ్ ప్లాన్ ప్రకటించటం గమనార్హం. ఈ క్రమంలో జియో రూ.2025 కొత్త న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రిలీజ్ చేసింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 200 రోజుల పాటు అపరిమిత 5జీ ఇంటర్నెట్ సేవలను అందుకుంటారని ప్రకటించింది. అలాగే రోజుకు 2.5 జీబీ చొప్పున 500 జీబీ 4జీ ఇంటర్నెట్ కూడా అదనంగా ఇవ్వబడుతోంది. ఇక అన్ని ప్లాన్ల మాదిరిగానే కాల్స్, ఎస్ఎమ్ఎస్ సేవలను అందించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ 11 నుంచి జనవరి 11 వరకు యూజర్ల కోసం అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

జియో రూ.2025 ప్లాన్ అందించే వివిధ బెనిఫిట్స్ పరిశీలిస్తే..
- అపరిమిత 5జీ ఇంటర్నెట్ సేవలు
- రోజుకు 2.5 జీబీ చొప్పున 500 జీబీ 4జీ ఇంటర్నెట్ డేటా
- రూ.2150 విలువైన పార్టనర్ కూపన్స్
- అంబానీలకు చెందిన ఎజియో రూ.500 విలువైన కూపన్, దీనిని రిడీమ్ చేసేందుకు రూ.2500 షాపింగ్ చేయాల్సి ఉంటుంది
- స్విగ్గీలో రూ.499 కనీస కొనుగోలుపై రూ.150 కూపన్
- ఈజ్ మై ట్రిప్ ద్వారా బుక్ చేసుకునే విమాన టిక్కెట్లపై రూ.1500 తగ్గింపు కూపన్
- వీటికి అదనంగా యూజర్లు జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమాలకు ఉచిత సబ్‍స్క్రిప్షన్ పొందుతారని కంపెనీ తన వెల్కమ్ ఆఫర్ ప్రకటించింది.
కంపెనీ తన న్యూ ఇయర్ వెల్కమ్ ఆఫర్ ప్రస్తుతం ఉన్న వినియోగదారులతో పాటు కొత్తగా వచ్చే యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పైన పేర్కొన్న ప్రయోజనాలను అందుకోవటానికి వినియోగదారులు జియో యాప్, వెబ్ సైట్ లేదా అధీకృత రిటైలర్ల వద్ద రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న అనేక 5జీ ప్లాన్ల కంటే ఈ న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ దాదాపు రూ.450 తక్కువకే అందుబాటులో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మీ జియో మెుబైల్ రీఛార్జ్ గడువు ముగింపుకు దగ్గర పడితే దీనిని కొనుగోలు చేయటం ఉత్తమ ఎంపికగా ఉంటుంది. అయితే ఇతర ప్లాన్ల కాస్ట్ కూడా కంపేర్ చేసి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం.
మార్చి 2025 నాటికి దేశవ్యాప్తంగా 4G సేవల రోల్ అవుట్ డెడ్‌లైన్ పూర్తయిన తర్వాత BSNL తన 5G సేవలను6-8 నెలల్లోపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడైంది. 2025 చివరి నాటికి ప్రభుత్వ ఆధీనంలోని టెల్కోకు 25 శాతం సబ్‌స్క్రైబర్ మార్కెట్ వాటా లక్ష్యంగా నిర్ణయించబడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తమ అంతర్గత గడువుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 4G సైట్‌లు మైనర్ కార్డ్ రీప్లేస్‌మెంట్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌తో 5Gకి అప్‌గ్రేడ్ చేయబడతాయని సమాచారం.


Click it and Unblock the Notifications