Ambani News: డిసెంబర్ మూడో వారంలో స్టాక్ మార్కెట్లు భారీగా హెచ్చు తగ్గులకు లోనయ్యాయి. ఈ సమయంలో బీఎస్ఈలోని టాప్-10 కంపెనీల్లో ఏడింటి మార్కెట్ క్యాప్ క్షీణతను నమోదు చేశాయి. అయితే మూడు కంపెనీలు మాత్రం పెట్టుబడిదారులకు భారీగా లాభాలను అందించాయి.
అలా పెట్టుబడిదారులకు సూపర్ లాభాలను తెచ్చిపెట్టిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ అగ్రస్థానంలో నిలిచింది. గత వారం ఐదు ట్రేడింగ్ రోజుల్లో రిలయన్స్ ఇన్వెస్టర్లు దాదాపు రూ.50,000 కోట్లు ఆర్జించారు. ఈ కాలంలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.47,021.59 కోట్లు పెరిగింది. దీంతో కంపెనీ విలువ కూడా రూ.17,35,194.85 కోట్లకు పెరిగింది. దీంతో అంబానీ సంస్థ విలువపరంగా మెుదటి స్థానాన్ని కొనసాగిస్తోంది.

మార్కెట్ విలువ పెరిగిన రెండు కంపెనీలలో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, HDFC బ్యాంక్ నిలిచాయి. ఈ సమయంలో హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.12,241.37 కోట్లు పెరిగి రూ.6,05.043.25 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం HDFC మార్కెట్ క్యాప్ రూ.11,049.74 కోట్ల వృద్ధిని నమోదు చేసి రూ.12,68,143.20 కోట్లకు చేరుకుంది.
ఇదే సమయంలో ఇన్వెస్టర్ల సంపదను క్షీణింపజేసిన కంపెనీలను పరిశీలిస్తే.. ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ. 30,235.29 కోట్లు క్షీణించి రూ.6,97,095.53 కోట్లకు తగ్గింది. దీని తర్వాత టాటాలకు చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.12,715.21 కోట్లు తగ్గి రూ.13,99,696.92 కోట్లకు చేరుకుంది. దీని తర్వాత అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ విలువ కూడా రూ.5,68,185.42 కోట్లకు క్షీణించగా.. ఇన్వెస్టర్లు రూ.10,486.42 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి.
ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.7,159.5 కోట్లు తగ్గి రూ.6,48,298.04 కోట్లకు, ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.3,991.36 కోట్లు తగ్గి రూ.5,67,645.03 కోట్లకు, భారతీ ఎయిర్‌టెల్ రూ.2,108.17 కోట్లు తగ్గి రూ.5,56,134.58 కోట్లకు మిగిలింది. టాప్-10 కంపెనీల్లో ఉన్న ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.2,087.25 కోట్లు తగ్గి రూ.5,01,635.57 కోట్లకు చేరింది.


Click it and Unblock the Notifications