Power war: దేశీయ ఇంధన రంగంలోకి భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. పవర్ సెక్టార్‌లో ఇప్పటికే ఉన్న ఆయా ప్లేయర్స్ తమ కంపెనీల కెపాసిటీని మరింత పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో ఓ సంస్థను కొనుగోలు చేసేందుకు అంబానీ, అదానీలతో పాటు ప్రభుత్వం కూడా పోటీపడుతోంది.
ల్యాంకో అమర్‌కంటక్ పవర్ ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. కాగా ప్రస్తుతం కార్పొరేట్ దివాలా ప్రక్రియను కొనసాగిస్తోంది. మొదటి దశలో 300 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వీటి నుంచి హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. దీనిని దక్కించుకోవడానికే ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ ఇద్దరి మధ్య సమరం నెలకొంది.

ఈ రేసు నుంచి తప్పుకునేందుకు నవీన్ జిందాద్‌కు చెందిన జిందాల్ పవర్.. అమరావతి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ప్రస్తుతం పోటీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్ మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేతృత్వంలోని కన్సార్టియం మాత్రమే ఉన్నాయి.
అదానీ పవర్ గేర్ మార్చి గతంలో ప్రతిపాదించిన 3 వేల 650 కోట్లను 4 వేల 100 కోట్లకు సవరించి హీట్ పెంచింది. దీంతో రుణదాతల అభ్యర్థన మేరకు మరోసారి వేలం జరగనుంది. అయితే PFC కన్సార్టియం 3 వేల 20 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌తో ఇప్పటికే ముందుకు వచ్చింది. వేలంలో పాల్గొనాల్సిందిగా మొదటగా రంగంలోకి దిగిన రిలయన్స్ కంపెనీకి కూడా ఆహ్వానం అందింది. కాగా ఈ త్రికోణ పోటీలో ఆ పవర్ కంపెనీని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి మరి!
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications