ఈ దసరా మీకు బంపర్ ఆఫర్లు రెడీగా ఉన్నాయి. ఒక వైపు మోదీ ప్రభుత్వం కొత్త GST 2.0 రేట్ కట్స్ తో వస్తుంటే, మరో వైపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్ పైనే డిస్కౌంట్లతో దుమ్ము రేపుతున్నాయి. ఇంతలో మనకి లాభం ఏంటి? అసలు ఎక్కడ ఎక్కువ సేవింగ్స్ దొరుకుతాయో తెలుసుకోవాలని ఉంది కదా! మొబైల్స్ నుంచి TVల వరకూ, ఫ్యాషన్ నుంచి ఫర్నిచర్ వరకూ ఎక్కడ చూసినా "బిగ్గెస్ట్ ఎవర్ డీల్" అని బోర్డులు కంటపడతాయి. కానీ అసలు మాటేమిటంటే మన జేబుకి ఏది లాభమో, ఎక్కడ డిస్కౌంట్ నిజంగానే వర్కౌట్ అవుతుందో అదే మేటర్.

ఎందుకంటే ఆన్‌లైన్ సేల్స్ లో "10% ఆఫ్" అని కనిపించినా, లోపల కాప్స్ ఉంటాయి. EMIలు "నో-కాస్ట్" అని కనిపించినా, చివరికి GST, ప్రాసెసింగ్ ఫీజులు కట్టాల్సిందే. మరో వైపు తెలివిగా ఆడేవాళ్లు బ్యాంక్ వోచర్స్, రివార్డ్ పాయింట్లతో డబుల్ లాభం కూడా అందుకుంటున్నారు. అందుకే ఈ పండుగ సీజన్‌లో ఎవరు స్మార్ట్‌గా ప్లాన్ చేస్తారో వాళ్లకే అసలు డిస్కౌంట్ దొరుకుతుంది. మధ్యతరగతి షాపర్‌కు అసలు గేమ్ డిస్కౌంట్‌లో కాదు మనం ఏ కార్డ్ వాడుతున్నాం, ఎక్కడ లావాదేవీ చేస్తున్నాం, ఆ లెక్కల్లోనే ఉంటుంది.
10% డిస్కౌంట్ : అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ, మిన్త్రా గానీ 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పేస్తాయి. కానీ దానికి గరిష్ట లిమిట్ ఉంటుందని మనం మర్చిపోతాం.
ఫ్లిప్‌కార్ట్ విషయానికి వస్తే, ICICI, Axis బ్యాంక్ కార్డ్స్ వాడితే 10% డిస్కౌంట్ ఇస్తారు కానీ అది గరిష్టంగా రూ. 4,500 వరకే పరిమితం. అమెజాన్ మాత్రం SBI కార్డ్స్‌తో 10% ఆఫర్ ఇస్తుంది, కానీ ఇక్కడ కూడా షరతులు ఉన్నాయి. మొబైల్స్‌కి కేవలం రూ. 1,000 మాత్రమే, ఇతర వస్తువులకి గరిష్టంగా రూ. 1,500 వరకే. మిన్త్రా అయితే HDFC కార్డ్ హోల్డర్స్‌కి 10% ఇస్తోంది, అది కూడా రూ. 750 వరకే, అంతేకాకుండా కనీసం రూ. 3,500 పైగా షాపింగ్ చేసినప్పుడే ఈ ఆఫర్ వర్కౌట్ అవుతుంది. పెద్ద బిల్లులు పెట్టేవారికి అమెజాన్ బోనస్ డిస్కౌంట్ కూడా పెడుతోంది. రూ. 30,000 బిల్ మీద అదనంగా రూ. 500, రూ. 1 లక్ష దగ్గర అయితే దాదాపు రూ. 4,000 వరకు ఫ్లాట్ ఆఫ్.
వోచర్లు: ఇప్పుడు తెలివైన షాపర్లు ఏం చేస్తున్నారు అంటే, డైరెక్ట్‌గా కార్డ్ వాడరు. మరో స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఉదాహరణకి,ICIC ఐషాప్, HDFC స్మార్ట్‌బై లాంటి బ్యాంక్ పోర్టల్స్ ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వోచర్లు కొని షాపింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే రివార్డ్ పాయింట్లు దాదాపు 18% వరకు వచ్చే అవకాశం ఉంది. సింపుల్ లాజిక్ ఇది అమెజాన్‌లో రూ. 20,000 ఫోన్‌ను SBI కార్డ్‌తో నేరుగా కొనుగోలు చేస్తే కేవలం రూ. 1,000 డిస్కౌంట్ వస్తుంది. కానీ అదే ఫోన్ కోసం ICICI Emeralde కార్డ్ ద్వారా iShopలో వోచర్లు కొనుగోలు చేస్తే దాదాపు రూ. 3,600 విలువైన రివార్డ్స్ పొందవచ్చు. అర్థం ఏంటంటే, ఈ వోచర్ గేమ్ ఆడితే మీరు సూపర్ స్మార్ట్ షాపింగ్ చేసుకున్నట్టే. బ్యాంక్ పోర్టల్స్ (ICICI iShop, HDFC SmartBuy) ద్వారా అమెజాన్/ ఫ్లిప్‌కార్ట్ వోచర్లు కొంటారు.
"నో-కాస్ట్ EMI" నిజంగా నో-కాస్ట్ నా?: నో-కాస్ట్ EMI అని చూసి "వావ్, ఫ్రీే!" అని అనుకోకూడదు. ప్రాసెసింగ్ ఫీజులు, GST లు కలిపి చిన్న చిన్న అదనపు ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకి, అమెజాన్‌లో రూ. 98,000 TV 9 నెలల నో-కాస్ట్ EMIతో కొంటే, చివరికి దాదాపు రూ. 1,473 అదనంగా కట్టాలి అవుతుంది. కాబట్టి EMIకి ముందు చిన్న లెక్కలు వేసుకుని చూసుకుంటే బెటర్.
కార్డ్ లేదు? UPI: బ్యాంక్ కార్డ్ లేకపోయినా నిరాశ పడాల్సిన పని లేదు. ఫ్లిప్‌కార్ట్ UPI ద్వారా గిఫ్ట్ కార్డ్ కొంటే 5% ఆఫర్ వస్తుంది. అది చెక్అవుట్ దగ్గర క్యాష్‌లా వాడుకోవచ్చు. చివరి టిప్స్ ఏంటంటే, చిన్న షాపింగ్ చేస్తే సింపుల్ గా బ్యాంక్ డైరెక్ట్ డిస్కౌంట్ వాడితే సరిపోతుంది. పెద్ద షాపింగ్ చేస్తే మాత్రం వోచర్, ప్రీమియం కార్డ్ రివార్డ్స్ వాడితే మాక్స్ లాభం వస్తుంది. EMI ఆప్షన్ తీసుకోవాలంటే, నిజంగా ఆ డీల్ వర్కౌట్ అవుతుందో లేదో ముందుగా లెక్కలు వేసి చూసుకోవడం బెటర్.
పండుగల్లో షాపింగ్ అనేది కేవలం ఉత్సాహం కాదు, ఇది ఒక లెక్కల గేమ్. ఎవరు బాగా లెక్క కడతారో వాళ్లకే అసలు డిస్కౌంట్ దొరుకుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications