e-commerce: అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజ ఇ-కామర్స్ కంపెనీగా అమెజాన్ కొనసాగుతూ వస్తోంది. అయితే అడపాదడపా సదరు సంస్థపై ఆరోపణలు వస్తూనే ఉంటున్నాయి. తాజాగా ప్రముఖ వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమెజాన్ తాను ఎదగడానికి నిజంగా ఇలా చేస్తుందా అని పలువురు షాక్ అవుతున్నారు.
భారతీయ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌తో పోలిస్తే అమెజాన్ కాస్త వెనుకబడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలో వాల్ స్ట్రీట్ జర్నల్ రిలీజ్ చేసిన నివేదిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గ్లోబల్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అనేక సంవత్సరాలుగా వాల్‌మార్ట్, ఈబే, ఫెడెక్స్ సహా ఇతర ప్రత్యర్థులపై నిఘా పెట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

నివేదిక ప్రకారం.. ఆయా సంస్థల ఇంటెల్‌ను సేకరించడానికి బిగ్ రివర్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ పేరిట అమెజాన్ షెల్ కంపెనీని నిర్వహించింది. USలో ఉన్న పోటీదారులపై దృష్టి కేంద్రీకరించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేయడంతో క్రమంగా ఆ సంస్థ పరిధి భారత్‌లోని ఫ్లిప్‌కార్ట్‌కు కూడా విస్తరించింది.
అమెజాన్‌లో ఈ ప్రాజెక్ట్‌ను మొదటగా 'ప్రాజెక్ట్ క్యూరియాసిటీ' అని పిలిచేవారు. తర్వాత బిగ్ రివర్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ గా మార్చారు. సంస్థ ఉద్యోగులు ప్రత్యేకమైన సమాచారాన్ని ముందుగానే సేకరించి, అమెజాన్‌కు పంపించడానికి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయదారులుగా ఉన్నారు. ఇ-కామర్స్ విభాగంలో పెద్దమొత్తంలో మార్కెట్ షేర్ సాధించేందుకు ఇరు కంపెనీలు పోటీ పడుతున్న వేళ ఈ నివేదిక వెలువడటం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఒకవేళ ఎప్పుడైనా విషయం బయటకు వస్తే తన ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సైతం అమెజాన్ ముందే రెడీ చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా బిగ్ రివర్ సర్వీసెస్ ఉద్యోగులకు నాన్-అమెజాన్ IDలు ఇచ్చారు. అమెజాన్ ప్రతినిధి కూడా ఈ తరహా ప్రాక్టీస్ వ్యాపారంలో సర్వసాధారణమని వెల్లడించారు. ఇతర కంపెనీల మాదిరిగానే తాము కూడా బెంచ్ మార్కింగ్ మరియు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ టీమ్స్ కలిగి ఉన్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications