Amazon Secret Store: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటి అమెజాన్. ఇది తన వ్యాపారంతో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పోటీకి తెరలేపింది. వాస్తవానికి కంపెనీకి లాభాలు లేకున్నప్పటికీ దానిని కొనసాగిస్తూనే ఉంది.
అమెజాన్ తన వ్యాపార ప్రత్యర్థులైన వాల్‌మార్ట్, ఈబే, ఫెడెక్స్ వంటి కంపెనీల వ్యాపారాలపై గూఢచర్యం చేయటానికి రహస్య దుకాణాన్ని నడుపుతున్నట్లు తెలిసింది. ఈ నకిలీ వ్యాపారాన్ని ప్రాజెక్ట్ క్యూరియాసిటీ అని పిలుస్తారు. ప్రాజెక్ట్ 2015లో అమెజాన్‌లో థర్డ్-పార్టీ విక్రేతల అనుభవాలను ఇ-కామర్స్ ప్రత్యర్థులతో పోల్చడానికి ఒక మార్గంగా ప్రారంభించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే తర్వాత దీనిని తన వ్యాపార పోటీదారులపై ముఖ్యంగా వాల్‌మార్ట్‌పై స్నూపింగ్ సాధనంగా మార్చిందని వెల్లడించింది.

బిగ్ రివర్ సంస్థ పేరుతో అమెజాన్ తన పోటీదారుల ప్లాట్‌ఫారమ్‌లపై టీ-షర్టులు, షూ, బీచ్ కుర్చీలు వంటి వస్తువులను విక్రయించింది. దీని ద్వారా అమెజాన్ తన స్వంత వ్యాపార నిర్ణయాలను తెలియజేయడానికి ఉపయోగపడే సమాచారాన్ని పొందటమే లక్ష్యంగా పనిచేసిందని జర్నల్ నివేదించింది. ఈ క్రమంలో బిగ్ రివర్ ఉద్యోగుల ఎలక్ట్రానిక్ రికార్డులను వీలైనంత తగ్గించటంతో పాటు నాన్ అమెజాన్ ఇమెయిల్స్ ఉపయోగించినట్లు వెల్లడైంది. ఎవరైనా అమెజాన్‌లో పనిచేస్తున్నారని తెలిస్తే ఎలా స్పందించాలో కూడా వారికి శిక్షణ ఇచ్చారు.
బిగ్ రివర్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ సభ్యులు తమ సేల్స్ సిస్టమ్‌లను యాక్సెస్ చేస్తున్నప్పుడు పోటీదారుల ధర, ప్రకటనల వ్యవస్థలు, కేటలాగ్‌లు, లిస్టింగ్ పేజీల స్క్రీన్‌షాట్‌లను తీసుకోవాలని ఆదేశించారు. వారు తీసిన స్క్రీన్‌షాట్‌లలో దేనినైనా ఇమెయిల్ చేయకుండా నిషేధించబడ్డారు. బిగ్ రివర్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ అందించిన సమాచారం ఆధారంగా.. అమెజాన్ సైట్‌లో విక్రేత అనుభవాన్ని మెరుగుపరచడానికి మార్పులు చేసింది. బిగ్ రివర్ ప్రత్యర్థుల మార్కెట్‌ప్లేస్ వెబ్‌సైట్ల ద్వారా విక్రయించడానికి దాని స్వంత బ్రాండ్‌లను కూడా అభివృద్ధి చేసింది.


Click it and Unblock the Notifications