Amazon: TCSను ఫాలో అవుతున్న అమెజాన్.. అందుకు అంగీకరించని సిబ్బందిపై వేటుకు సిద్దం
Amazon: కరోనా విజృంభణ సమయంలో ఆయా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. తర్వాత మెల్లమెల్లగా సిబ్బందిని ఆఫీసులకు పిలుస్తున్నాయి. TCS వాటిలో ముందు వరుసలో ఉండగా.. అమెజాన్ కూడా ఈ విషయంపై సీరియస్ గా వ్యవహరించాలని నిర్ణయించుకుంది.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులను 3 రోజులపాటు తప్పనిసరిగా కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని ఆదేశించింది. ఇందుకు అంగీకరించని వారిపట్ల కఠిన చర్యలకు సిద్ధమైంది. ధిక్కరించిన సిబ్బందిని తొలగించడానికి సైతం ప్రిపేర్ అవుతోంది. ఇందుకోసం మెయిల్ టెంప్లేట్స్ ను సైతం రెడీ చేసింది. CEO ఆండీ జెస్సీ ప్రకటన అనంతరం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకు అనుగుణంగా.. 3 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీకి అంగీకరించని ఉద్యోగులతో మొదటిసారి ప్రైవేట్ గా మాట్లాడమని మేనేజర్‌లకు కంపెనీ నిర్దేశించింది. రెండోసారి తమ మీటింగ్ సారాంశాన్ని ఇమెయిల్‌లో డాక్యుమెంట్ చేయాలని సూచించింది. ఈ నిబంధన పాటించేందుకు ఉద్యోగి నిరాకరిస్తే.. మరొక సమావేశాన్ని షెడ్యూల్ చేయమని పేర్కొంది. చివరగా క్రమశిక్షణా చర్యలు సహా ఉద్యోగం రద్దు ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేసింది.
ఒకవేళ ఉద్యోగులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిష్కారానికి కలిసి పనిచేయాలని కంపెనీ తన మేనేజర్లకు సూచించింది. వీలైనంత త్వరగా సిబ్బంది తన నిర్ణయాన్ని యాజమాన్యానికి వెల్లడించాలని కోరింది. అవరసరమైతే 2 వారాల అనంతరం మరోసారి మేనేజర్లతో సమావేశమయ్యే అవకాశం కల్పించినట్లు చెప్పింది. తద్వారా అమెజాన్ తన కార్పొరేట్ సంస్కృతికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications