Amazon News: అమెజాన్ అలెక్సాకు సరికొత్త హంగులు.. పోటీలో నిలవాలంటే తప్పదు మరి.. కానీ..
Amazon Alexa: అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను దిగ్గజ కంపెనీలు పక్కాగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వివిధ సర్పీసులను అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నాయి. అమెజాన్ కూడా తన ఐకానిక్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు మార్పులు చేసేందుకు సిద్ధమైంది.
బిజినెస్ పెంచుకునేందుకు అమెజాన్ కొత్త పద్దతికి తెర తీసింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అప్‌గ్రేడ్ చేస్తోంది. తద్వారా ఇకపై నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజును వసూలు చేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. గూగుల్ మరియు ఓపెన్ ఏఐ నుంచి అమెజాన్ ప్రస్తుతం తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. తాజా చర్యలతో మరోసారి మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది.

ఈ అలెక్సా సబ్‌స్క్రిప్షన్ 139 డాలర్ల విలువైన అమెజాన్ ప్రైమ్ ఏడాది ఆఫర్‌లో చేర్చబడదని నివేదిక పేర్కొంది. అయితే టూ-వే సంభాషణా సామర్థ్యంతో GPT-4oని తీసుకొస్తున్నట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది. రియల్ టైమ్‌లో సంభాషణలను వివిధ భాషల్లోకి అనువదించగల నైపుణ్యం దీని సొంతమని వెల్లడించింది. ఇది జరిగిన తర్వాత అలెక్సా అప్‌గ్రేడ్ గురించి చర్చ మొదలైంది.
అలెక్సాను మరింత శక్తివంతంగా మార్చాలని అమెజాన్ భావిస్తున్నట్లు పరికరాలు మరియు సేవల విభాగం మాజీ SVP డేవిడ్ లింప్ తెలిపారు. ఇటీవల కొత్త AI చాట్‌బాట్‌ల అభివృద్ధి సంస్త వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్‌పై ఒత్తిడిని పెంచినట్లు నివేదిక పేర్కొంది. ఆయనకు సహజంగానే అలెక్సా ప్రాజెక్టుపై ఆసక్తి ఉండగా.. 2021లో ఆండీ జెస్సీ CEOగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications