Quick Commerce: భారతదేశంలోని టైర్-1, టైర్-2 నగరాల్లో ప్రస్తుతం క్విక్ కామర్స్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం 15 నిమిషాల్లోపే కిరాణా సరకులతో పాటు అనేక వస్తువులను అనేక స్టార్టప్ కంపెనీలు డెలివరీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించాలని దీని నుంచి పేరణను అందిపుచ్చుకుంది.
అయితే క్విక్ కామర్స్ వ్యాపారంలో అనేక కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వేళ అమెరికాకు చెందిన అమెజాన్ కూడా ఈ సెగ్మెంట్ పై తన దృష్టిని సారించింది. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా విభాగం కూడా క్విక్ కామర్స్ సేవలను స్టార్ట్ చేసి కేవలం 15 నిమిషాల్లోపే వస్తువుల డెలివరీని ప్రారంభించాలని నిర్ణయించింది. ముందుగా ఈనెలాఖరు నుంచి సేవలను బెంగళూరులో తొలుత ప్రారంభించనున్నట్లు ఇండియా అండ్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు.

తాము అతిపెద్ద కస్టమర్ బేస్‌కు అత్యంత వేగవంతమైన, ఎక్కువ ఉత్పత్తులను అందించాలనుకుంటున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. సిటీ కస్టమర్లకు రోజువారీ నిత్యావసరాలను వేగంగా కోరుకుంటున్నట్లు తాము గ్రహించామన్నారు. అందువల్ల క్విక్ కామర్స్ సేవలను డిసెంబర్ నుంచి బెంగళూరులో స్టార్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వీటిని అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఏమార్కెట్లోనూ ఇప్పటి వరకు 15 నిమిషాల క్విక్ కామర్స్ సేవలను ప్రారంభించలేదు. అయితే తొలుత బెంగళూరులోని ప్రజలకు 1000-2000 ఉత్పత్తులను క్విక్ కామర్స్ ద్వారా విక్రయిస్తామని, దీని తర్వాతే దేశంలోని ఇతర నగరాలకు సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు.
కొనుగోలుదారుల్లో మార్పులపై డాటమ్ ఇంటెలిజెన్స్ అందించిన రిపోర్ట్ పరిశీలిస్తే.. 82% మంది వినియోగదారులు తమ కిరానా కొనుగోళ్లలో కనీసం నాలుగింట ఒక వంతును క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు తరలించారు. అలాగే 5% మంది కిరాణా దుకాణాల వద్ద షాపింగ్ చేయడం పూర్తిగా ఆపివేశారు. రోజురోజుకూ ఈ ధోరణి పెరిగిపోతోందని రిపోర్ట్ చెబుతోంది. రిటైల్ వ్యాపారంలో వస్తున్న భారీ మార్పులు కిరాణా షాపుల యజమానులను బాధిస్తోంది. దీనిపై బెంగళూరులోని ఒక కిరాణా వ్యాపారి మాట్లాడుతూ క్విక్ కామర్స్ వల్ల వ్యాపారం కొంత దెబ్బతిందని, అయితే ఎక్కువగా యువత వీటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ పాత తరం ప్రజలు తమకు నచ్చిన వస్తువులను నేరుగా వెళ్లి కొనుక్కోవటానికి ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. చిన్న కిరాణా షాపులు చాలా నగరాల్లో క్విక్ కామర్స్ వల్ల మూతపడుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications