Amazon offers: నేటి నుంచి అమెజాన్ స్మార్ట్ హోమ్ డేస్ సేల్.. టెక్ ఉత్పత్తులపై ఏకంగా 75 శాతం ఆఫ్
Amazon offers: పండుగ సీజన్‌లో ఇండియాలో జరిగే కొనుగోళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. నూతన వస్త్రాల దగ్గర నుంచి పలు కొత్త ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ సమయంలో పెద్ద మొత్తంలో మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు ఇ-కామర్స్ సంస్థలు పోటీపడి మరీ ఆఫర్స్ ఇస్తుంటాయి. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా అలాంటి సేల్ ఒకటి నిర్వహిస్తోంది.
అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ పేరిట భారీ సేల్ నిర్వహిస్తూ ఉంటుంది. దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ సేల్‌గా ఇప్పటికే దీనికి పేరుంది. కాగా ఇప్పుడు ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్.. స్మార్ట్ హోమ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో పలు టెక్ ఉత్పత్తులపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు లభించనున్నట్లు ప్రకటించింది.

ఈ స్మార్ట్ హోమ్ డేస్ సేల్‌లో అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్లు, అలెక్సాతో వినియోగించే పలు ఉత్పత్తులు అత్యంత తక్కువ ధరకే అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇవేకాక స్మార్ట్ బల్బులు, స్మార్ట్ కెమెరాలు, స్మార్ట్ ప్లగ్‌లు సరసమైన ధరలకు పొందవచ్చని తెలిపింది. విప్రో, ఫిలిప్స్, క్యూబో, హోమ్ మేట్, టీపీ లింక్, Mi, రియల్ మీ, హావెల్స్ కు చెందని పలు బ్రాండ్ల ఉత్పత్తులు అమ్మకానికి పెట్టనున్నట్లు స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్.. సెప్టెంబరు 13 వరకు కొనసాగుతుందని అమెజాన్ ప్రకటించింది. కేవలం విడిగానే కాకుండా కొన్ని ఉత్పత్తులను కాంబో ఆఫర్‌లో కూడా విక్రయించనున్నట్లు కంపెనీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ లైనప్‌లోని ఉత్పత్తులు 2,099 నుంచి ప్రారంభమై 10 వేల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ ప్రొడక్ట్స్ పై 65 శాతం, 75 శాతం తగ్గింపు లభిస్తుందని చెప్పింది.


Click it and Unblock the Notifications