అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు రెడీ అవుతోంది. ఈ వారం నుంచి ప్రారంభమయ్యే కొత్త రౌండ్ తొలగింపులలో సుమారు 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులు ప్రభావితమవుతారని అంతర్గత వర్గాల సమాచారం తెలిపింది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత కార్యకలాపాల పునర్నిర్మాణం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ తొలగింపులపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా.. మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులు క్లౌడ్ కంప్యూటింగ్, పరికరాలు, కమ్యూనికేషన్స్, రిటైల్ కార్యకలాపాలు వంటి అనేక విభాగాలను ప్రభావితం చేయనున్నాయి. అయితే సంస్థ ఈ నివేదికలపై స్పందించడానికి నిరాకరించింది.

ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.54 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు, మిగతా వారు గిడ్డంగి, లాజిస్టిక్స్ విభాగాల్లో పనిచేస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో (2022-2024) అమెజాన్ 27 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.తాజా నిర్ణయం ఆ పునర్నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది.
మహమ్మారి తర్వాత మార్కెట్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించడం, కార్యకలాపాలను సరళీకృతం చేయడం, మరియు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడం వంటి ఖర్చు నియంత్రణ వ్యూహాలను అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ చేపట్టారు. ఈ క్రమంలో సంస్థలోని అనవసరమైన పదవులను తొలగించి AI టెక్నాలజీ ద్వారా ఆటోమేషన్ పెంచే దిశగా అడుగులు వేస్తోంది అమెజాన్ కంపెనీ.
జాస్సీ గతంలో విడుదల చేసిన అంతర్గత మెమోలో, జనరేటివ్ AI, ఆటోమేషన్ సాధనాలు అనేక సాధారణ పనులను స్వయంచాలకంగా నిర్వహిస్తాయని, దీని వలన చిన్న కార్పొరేట్ టీమ్‌లు సరిపోతాయని పేర్కొన్నారు.భవిష్యత్తులో అమెజాన్ మరింత సాంకేతికత ఆధారిత సంస్థగా మారనుందని ఆయన చెబుతున్నారు.
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు కూడా ఇలాంటి మార్పుల దిశగా అడుగులు వేస్తున్నాయి. Layoffs.fyi డేటా ప్రకారం 2025లో ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు దాదాపు 98వేల మంది ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా AI అభివృద్ధి, ఆటోమేషన్ వైపు వనరులను మళ్లిస్తూ గణనీయమైన layoffs ప్రకటించాయి.
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ప్రణాళిల త్వరలోనే సాంకేతిక రంగంలోని ఉద్యోగ మార్కెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అమెజాన్ వంటి పెద్ద సంస్థలు AIలో పెట్టుబడులు పెంచుతున్నప్పటికీ, దాని ఎఫ్టెక్ట్ ఉద్యోగ అవకాశాలపై తక్షణ ప్రభావం చూపుతోంది.ఏదేమైనా అమెజాన్ తీసుకున్న తాజా నిర్ణయం AI ఆధారిత వ్యాపార పునర్నిర్మాణానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇది సాంకేతిక పరిణామంలో ముందంజగా నిలిచే ప్రయత్నం అయినప్పటికీ, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళనను రేకెత్తించింది. పరిశ్రమ విశ్లేషకులు ఈ మార్పులు కార్పొరేట్ రంగంలో AI యొక్క కొత్త యుగానికి నాందిగా నిలుస్తాయని పేర్కొంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications