ఇండియాలోనే ఉంటూ రూ. 1.8 కోట్ల విదేశీ ఉద్యోగం.. టెక్కీ చెప్పిన ఈ 10 సీక్రెట్స్ ఇప్పుడు తెగ ట్రెండింగ్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సంబంధించిన ఒక సక్సెస్ స్టోరీ విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. విదేశాలకు వెళ్లకుండా, అక్కడ ఎలాంటి పరిచయాలు (Network) లేకపోయినా.. కేవలం ఇండియాలో తన రూమ్‌లో కూర్చునే రూ. 1.8 కోట్ల భారీ ప్యాకేజీతో యూకే (UK) లో అంతర్జాతీయ ఉద్యోగాన్ని ఎలా సాధించవచ్చో ఒక అమెజాన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ క్లియర్ గా వివరించాడు.

కార్తీక్ మోడీ అనే ఈ ఇంజనీర్ ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ కెరీర్ రోడ్‌మ్యాప్ ప్రస్తుతం ఐటీ వర్గాల్లో విపరీతంగా ట్రెండింగ్ (Trending) అవుతోంది. షార్ట్‌కట్లు, అదృష్టం నమ్ముకోకుండా కేవలం పక్కా ప్లానింగ్‌తో ఈ ఘనత సాధించవచ్చని అతను నిరూపించాడు. సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన అభ్యర్థులు లబ్ధి పొందేలా అతను పాటించిన ఆ 10 ముఖ్యమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon Techie Shares 10 Secrets To Land Rs 1 8 Crore UK Job From India Check Trending Strategy

1. వీసా స్పాన్సర్ చేసే కంపెనీల లిస్ట్

కార్తీక్ ముందుగా మన దేశంలో ఉండే వారికి వీసా స్పాన్సర్ చేసే సుమారు 25 నుండి 30 అంతర్జాతీయ కంపెనీలను టార్గెట్ చేశాడు. దీనికోసం లింక్డ్‌ఇన్ (LinkedIn), ఇండీడ్ (Indeed), , లెవెల్స్.ఎఫ్‌వైఐ (Levels.fyi) వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సరైన కంపెనీలను ఎంచుకున్నాడు.

2. జాబ్ డిస్క్రిప్షన్ల విశ్లేషణ

ఏదో గుడ్డిగా అప్లై చేయకుండా, సుమారు 40 ఉద్యోగ ప్రకటనలను (Job Descriptions) క్షుణ్ణంగా చదివాడు. వాటిలో ఏయే స్కిల్స్ ఎక్కువగా అడుగుతున్నారో గమనించి, ఆ కీలకమైన అంశాలపైనే తన ప్రిపరేషన్ ఫోకస్ పెట్టాడు.

3. 12 వారాల పక్కా ప్లాన్

డిసిప్లిన్‌గా ఉండటం కోసం తన ప్రిపరేషన్‌ను 10 నుండి 12 వారాల టైమ్ టేబుల్‌గా మార్చుకున్నాడు. మొదటి కొన్ని వారాలు డేటా స్ట్రక్చర్స్ & అల్గారిథమ్స్ (DSA), ఆ తర్వాత సిస్టమ్ డిజైన్, డొమైన్ నాలెడ్జ్, బిహేవియరల్ ఇంటర్వ్యూలపై దృష్టి పెట్టాడు.

4. క్వశ్చన్లు కాదు.. ప్యాటర్న్స్ ముఖ్యం

కోడింగ్ ఇంటర్వ్యూల కోసం వందలాది ప్రశ్నలను బట్టీ పట్టకూడదని కార్తీక్ సలహా ఇస్తున్నాడు. దానికి బదులుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతులను (Patterns) అర్థం చేసుకోవడంపై శ్రద్ధ పెట్టాడు. ఇందుకోసం లీట్‌కోడ్ (LeetCode), నీట్‌కోడ్ వంటి సైట్లను వాడుకున్నాడు.

5. గేమ్ ఛేంజర్ 'సిస్టమ్ డిజైన్'

అంతర్జాతీయ ఉద్యోగాల్లో సిస్టమ్ డిజైన్ అనేది అత్యంత కీలకం. పేమెంట్ సిస్టమ్స్, సెర్చ్ ఇంజన్లు, నోటిఫికేషన్ సర్వీసెస్ వంటి పెద్ద నెట్‌వర్క్‌లను ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నాడు. ఇందుకోసం గేట్‌హబ్ (GitHub) లోని సిస్టమ్ డిజైన్ ప్రైమర్, ఏడబ్ల్యూఎస్ (AWS) బ్లాగులను చదివాడు.

6. రియల్ వరల్డ్ ప్రాజెక్టుల నోట్స్

తాను గతంలో చేసిన ప్రాజెక్టుల వివరాలను, వాటి పర్ఫార్మెన్స్, ల్యాటెన్సీ సమస్యలను ఎలా పరిష్కరించాడో ఒక నోట్స్ రూపంలో రాసుకున్నాడు. నోషన్ (Notion) లేదా గూగుల్ డాక్స్‌లో ఈ వివరాలను భద్రపరుచుకుని ఇంటర్వ్యూల సమయంలో రిఫరెన్స్‌గా వాడుకున్నాడు.

7. ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ స్టైల్

విదేశీ ఇంటర్వ్యూలలో సమాధానాలు తెలియకపోతే అబద్ధాలు చెప్పకుండా, తమ ఆలోచనా విధానాన్ని (Thought Process) స్పష్టంగా వివరించడం, తెలియని విషయాలను నిజాయితీగా ఒప్పుకోవడం చాలా ప్లస్ అవుతుందని కార్తీక్ తెలిపాడు.

8. వన్-పేజ్ ఇంటర్నేషనల్ రెజ్యూమే

మన దేశంలో వాడే సాంప్రదాయ రెజ్యూమే ఫార్మాట్ కాకుండా, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు సరిపోయేలా కేవలం ఒకే ఒక్క పేజీలో తన విజయాలను స్పష్టంగా చూపించే రెజ్యూమేను తయారు చేసుకున్నాడు. దీనికోసం ఓవర్ లీఫ్ (Overleaf) వంటి టెంప్లేట్లను వాడాడు.

9. మాక్ ఇంటర్వ్యూలు (Mock Interviews)

నిజమైన ఇంటర్వ్యూలకు వెళ్లేముందు 6 నుండి 8 మాక్ ఇంటర్వ్యూలు రాశాడు. దీనివల్ల తనలో ఉన్న లోపాలు, భయాలు పోయి రియల్ ఇంటర్వ్యూను చాలా కాన్ఫిడెంట్‌గా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది.

10. క్వాలిటీ అప్లికేషన్స్

వందలాది ఉద్యోగాలకు ఒకేసారి అప్లై చేయకుండా (Mass Applying), తనకు సరిగ్గా సరిపోయే ఉద్యోగాలను మాత్రమే ఎంచుకుని, అవి పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే అప్లై చేశాడు.

ఈ ట్రెండింగ్ స్టోరీ ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలోని వారికి తెలిసేది ఏంటంటే.. గ్లోబల్ లెవెల్ ఉద్యోగాలు సాధించడానికి కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటే సరిపోదు. దానికి సరైన ప్లానింగ్, సిస్టమ్ డిజైన్ అవగాహన, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తోడవ్వాలి. అప్పుడే ఇండియాలో ఉండే కోట్ల రూపాయల ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+