నెలకు రూ. 11 లక్షల జీతం, రేంజ్ రోవర్ కార్.. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు! వైరల్ అవుతున్న టెక్కీ పోస్ట్!

అమెరికాలో ఐటీ ఉద్యోగం, చేతినిండా జీతం, లగ్జరీ కార్లు, సొంత ఇళ్లు.. ఇవన్నీ ఉంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎంత సంపాదించినా కూడా సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఆర్థిక భద్రత ఉండదని నిరూపిస్తోంది ఒక ఇండియన్ టెక్కీ కథ. అమెరికాలోని సీయాటిల్‌లో అమెజాన్ (Amazon) కంపెనీలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఈషాన్ జైన్ అనే భారతీయ సంతతి వ్యక్తి తన ఆదాయం, ఖర్చుల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు.

అతని వార్షిక ప్యాకేజీ దాదాపు 3,00,000 డాలర్లు (మన దేశీ కరెన్సీలో దాదాపు రూ. 2.8 కోట్లు). అన్ని టాక్సులు, సేవింగ్స్ పోనూ నెలకు అతని చేతికి 12,000 డాలర్లు (దాదాపు రూ. 11 లక్షలు) వస్తాయి. ఇంత భారీ జీతం వస్తున్నా కూడా, పెరుగుతున్న ఖర్చుల వల్ల తనకు అసలు ఆర్థిక భద్రత ఉన్నట్లు అనిపించడం లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

Amazon Techie Earning Rs 11 Lakh Per Month Has 5 Properties But No Emergency Fund

అమెరికాలో ఒక ఇల్లు.. ఇండియాలో 4 ఆస్తులు!

ఈషాన్ తన ఫ్యామిలీతో కలిసి సీయాటిల్ సబర్బ్ ఏరియాలో 4 బెడ్‌రూమ్‌ల సొంత ఇళ్లలో ఉంటున్నాడు. 2023లో కొన్న ఈ ఇంటికి టాక్సులు, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి నెలకు ఏకంగా 5,000 డాలర్లు (సుమారు రూ. 4.7 లక్షలు) ఈఎంఐ (Mortgage) రూపంలోనే చెల్లిస్తున్నాడు. అయితే, 50 ఏళ్లకే రిటైర్ అవ్వాలనే బలమైన కోరికతో అతను చాలా అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అందులో భాగంగానే మన ఇండియాలో 3 నుండి 4 ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీలను కొన్నాడు. వీటి ద్వారా అద్దె ఆదాయం (Rental Income) పొందాలనేది అతని ప్లాన్. ఇవి కాకుండా ఫిజికల్ గోల్డ్, సిల్వర్ , స్టాక్ మార్కెట్లో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నాడు.

ఎమర్జెన్సీ ఫండ్ ఒక్క రూపాయి కూడా లేదు!

ఇన్ని కోట్ల ఆస్తులు, అంత పెద్ద జీతం ఉన్నప్పటికీ.. ఈషాన్ ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తున్నాడు. అతని దగ్గర ఎలాంటి ఎమర్జెన్సీ ఫండ్ (Emergency Fund) లేదు. అంటే అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి చేతిలో లిక్విడ్ క్యాష్ అస్సలు ఉంచడు.

అతని వింత వాదన

"నేను నా సేవింగ్స్ మొత్తాన్ని వెంటనే వేర్వేరు పోర్ట్‌ఫోలియోలలో ఇన్వెస్ట్ చేస్తాను. క్యాష్ రిజర్వ్స్ దాచుకోవడం నాకు నచ్చదు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే క్రెడిట్ కార్డులను వాడుకుంటాను, లేదా నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకుంటాను" అని ఈషాన్ చెప్పడం విశేషం.

జీతాన్ని మింగేస్తున్న సీయాటిల్ ఖర్చులు!

అతని ఇంట్లో తనే ఒక్కడే సంపాదిస్తున్నాడు. భార్య, ఒక బాబు ఉన్నారు, నవంబర్‌లో రెండో బేబీ రాబోతోంది. సింగిల్ ఇన్‌కమ్ ఫ్యామిలీ కావడంతో సీయాటిల్‌లో రోజువారీ ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయంటున్నాడు.

  • కార్ల ఖర్చులు: అతని దగ్గర ఒక రేంజ్ రోవర్, ఒక టెస్లా కార్ ఉన్నాయి. రేంజ్ రోవర్ పూర్తిగా పెయిడ్ ఆఫ్ అయినప్పటికీ, టెస్లా కార్ కోసం నెలకు 630 డాలర్లు కడుతున్నాడు.
  • గ్రోసరీస్ & షాపింగ్: కేవలం కాస్ట్‌కో (Costco) లో షాపింగ్ చేయడానికే నెలకు 1,500 డాలర్లు, ఇతర కిరాణా సామాన్లకు మరో 500 డాలర్లు ఖర్చవుతాయి.
  • ఇతర ఖర్చులు: కరెంట్, గ్యాస్ బిల్లులు నెలకు 800 డాలర్లు కాగా, కంపెనీ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా హెల్త్‌కేర్ కోసం అదనంగా 750 డాలర్లు కట్టాల్సి వస్తోంది. అవసరమైనప్పుడు నానీల (Nannies) కోసం రోజుకు 100 నుండి 250 డాలర్లు ఖర్చు పెట్టాలి.

వీటితో పాటు గత ఏడాది ట్రావెల్ చేయడం వల్ల రూ. 18 లక్షల (20,000 డాలర్లు) పర్సనల్ డెట్ (అప్పు) కూడా ఉంది. నెలకు రూ. 11 లక్షలు సంపాదిస్తున్నా.. సరైన క్యాష్ మేనేజ్‌మెంట్ , ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఎలాంటి టెన్షన్లు పడాల్సి వస్తుందో అమెజాన్ టెక్కీ లైఫ్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+