Amazon News: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇందుగలను అందులేను అన్నట్లుగా ఇండియాలో తన వ్యాపారవిస్తరణకు అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. తాజాగా దీనికోసం భారత ప్రభుత్వంతో చేతులు కలిపింది.
అమెజాన్ తన రవాణా ఖర్చులను తక్కువగా ఉండేలా చూసేందుకు కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ఈ క్రమంలో గంగా నదిపై సరకు రవాణాను పెంచేందుకు అమెరికా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తన అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య బుధవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ముందుగా దీనిని పాట్నా-కోల్‌కతా జలమార్గంలో పైలట్ ప్రాజెక్టు రూపంలో ప్రారంభించనున్నట్లు వెల్లడైంది.

పోర్ట్స్, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమెజాన్ ఇండియా IWAIతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. తాజా ఒప్పందంతో అమెజాన్ ఇండియా తన సరఫరా గొలుసును 14,500 కి.మీ పొడవునా పాట్నా-కోల్‌కతా విస్తీర్ణంలో నదులు, కాలువలు, బ్యాక్ వాటర్స్, క్రీక్స్‌లో విస్తరిస్తోంది. దీనికి ముందు జనవరిలో కంపెనీ తన అమెజాన్ ఎయిర్ సర్వీస్‌ను ప్రారంభించడం ద్వారా దేశంలో తన కార్గో నెట్‌వర్క్‌ను విస్తరించడం మెుదలు పెట్టింది. దీని తర్వాత జలమార్గాలను మెరుగుపరచటంపై కంపెనీ దృష్టి సారించింది.
పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దీనిని పెద్ద ఎత్తున విస్తరిస్తామని కంపెనీ చెబుతోంది. రోడ్డు రవాణా కంటే నీటిలో 91.6 శాతం తక్కువ ఇంధన వినియోగం ఉంటుంది. దేశంలో జమ రవాణాను మెరుపరిచే క్రమంలో కేంద్రం 113 ప్రాజెక్టులతో కూడిన సాగరమాల ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికోసం దాదాపు రూ.7,030 కోట్లను వెచ్చించింది. దీని ద్వారా 2030 నాటికి 200 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ సరకును అంతర్గత జలరవాణా ద్వారా ట్రాన్స్‌పోర్ట్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications