కరోనా మహమ్మారి సమయంలో కొంతమంది ప్రపంచ బిలియనీర్ల ఆదాయం భారీగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం జెఫ్ బెజోస్ నెట్ వర్త్ 150 బిలియన్ డాలర్లుగా ఉంది. బెజోస్ 2018 జూలైలో తొలిసారి ఈ మార్క్ చేరుకున్నారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆస్తి కరిగిపోయినప్పటికీ తొలి స్థానంలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా అమెజాన్ ఆదాయం భారీగా పెరిగి, బెజోస్ సంపద కూడా పెరిగింది.

కరోనా నుండి 35 బిలియన్ డాలర్ల పెరుగుదల
అమెరికా కుబేరుల సంపద ఈ ఏడాది 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. కరోనా ప్రారంభం అంటే మార్చి నుండి చూస్తే సంపద 19 శాతం పెరిగింది. దాదాపు 565 బిలియన్ డాలర్ల మేర ఎక్కువగా ఆర్జించారని ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ రిపోర్ట్ కూడా వెల్లడిస్తోంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుండి జెఫ్ బెజోస్ సంపద 35 బిలియన్ డాలర్లు పెరిగి 150 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

షేర్ల వ్యాల్యూ ఎంత పెరిగిందంటే
అమెజాన్ షేర్ వ్యాల్యూ 2,000 డాలర్ల నుండి 2,500 డాలర్లకు చేరుకుంది. ఇందులో బెజోష్ షేర్లు 55 మిలియన్లకు పైగా ఉన్నాయి. కరోనా - షట్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ బిజినెస్‌కు డిమాండ్ పెరిగింది. ఫేస్‌బుక్ షేర్ కూడా రికార్డు గరిష్టానికి చేరుకుంది. దీంతో జుకర్‌బర్గ్ సంపద మార్చి 18వ తేదీతో పోలిస్తే 30.1 శాతం బిలియన్ డాలర్లు పెరిగింది. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ల సంపద ఒక్కొక్కరిది 13 బిలియన్ డాలర్ల కంటే పైకి పెరిగింది. 1990 - 2020 మధ్య అమెరికా కుబేరుల సంపద 1130% పెరిగింది.

కలిసొచ్చిన కోరనా
ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లను సున్నా వద్ద ఉంచడం, బాండ్స్‌ను భారీగా కొనుగోలు చేస్తామన్న హామీని ఇవ్వడం అగ్రరాజ్యం మార్కెట్లు రాణించడానికి దోహదం చేశాయి. ఇవి టెక్ దిగ్గజ కంపెనీల స్టాక్స్ ర్యాలీకి కూడా ఉపయోగపడ్డాయి.


Click it and Unblock the Notifications