Amazon Prime: అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కొత్త ప్లాన్.. రూ.599లకే ఏడాది పాటు..
అమెజాన్ యూజర్ల కోసం కొత్త అమెజాన్ ప్రైమ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను సంవత్సరానికి రూ. 599లకే అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఎడిషన్ అనేది సింగిల్-యూజర్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ తో వీక్షకుల సంఖ్య పెంచుతుందని అమెజాన్ భావిస్తోంది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రారంభంలో భారతీ ఎయిర్‌టెల్ సహకారంతో టెల్కో-భాగస్వామ్యలో తీసుకొచ్చారు. భారత్ మొబైల్ యూజర్స్ భారీగా పెరుగుతుండడంతో ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.
రూ. 1,499
ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కస్టమర్‌లకు స్టాండర్డ్ డెఫినిషన్ (SD) నాణ్యత స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ మల్టీ-యూజర్ యాక్సెస్ సబ్‌స్క్రిప్షన్ కోసం సంవత్సరానికి రూ. 1,499 చెల్లించాలి. Amazon.inలో ఉచిత ఫాస్ట్ డెలివరీ, ప్రైమ్ మ్యూజిక్‌తో కూడిన యాడ్-ఫ్రీ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్‌తో సహా అన్ని ఇతర ప్రైమ్ ప్రయోజనాలు ఈ ప్లాన్ లో పొందవచ్చు. త 6 సంవత్సరాలలో మేము భారతదేశంలో ప్రైమ్ వీడియోలో భారీ వృద్ధిని చూశామని ప్రైమ్ వీడియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా అధిక నాణ్యత గల వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.

మొబైల్ డేటా
దేశంలో జియో రాకతో మొబైల్ డేటా వినియోగం భారీగా పెరిగింది. 2016 కంటే ముందు దేశంలో సగటున ఒక వ్యక్తి నెలకు 154ఎంబీ డేటాను మాత్రమే ఉపయోగించేవాడు. జియో వచ్చిన తర్వాత ఇది నెలకు 15.8 జీబీకి పెరిగింది. దీంతో ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ కు డిమాండ్ పెరిగింది.


Click it and Unblock the Notifications