Amazon News: అమెరికన్ టెక్ కంపెనీ అమెజాన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మేనేజర్లకు పూర్తి స్వేచ్ఛతో కూడిన బాధ్యతను అప్పగించింది.
అమెజాన్ తన రిటర్న్-టు-ఆఫీస్ విధానం విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. ఉద్యోగులు వారంలో మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే దీనిని ఫాలో అవ్వని ఉద్యోగులను ఉపేక్షించకుండా వెంటనే తొలగించేందుకు కంపెనీలోని మేనేజర్లకు పవర్స్ ఇచ్చింది. తన విధానాన్ని తప్పకుండా అమలు చేయాలనే లక్ష్యంతో ఈ కఠినమైన చర్య తీసుకోబడిందని సమాచారం.

అమెజాన్ తన రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తన గ్లోబల్ మేనేజర్ మార్గదర్శకత్వాన్ని అప్‌డేట్ చేసినట్లు ఇన్‌సైడర్ నివేదిక వెల్లడించింది. కంపెనీలో అంతర్గతంగా దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపింది. కంపెనీ మూడు రోజుల పాలసీకి కట్టుబడి ఉండని ఉద్యోగుల విషయంలో మేనేజర్లు ఉపేక్షించొద్దని, వారితో ఎలా వ్యవహరించాలో అందులో సూచించింది. రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాన్ని పాటించడంలో విఫలమైన ఉద్యోగులను సమర్థవంతంగా తొలగించడానికి మేనేజర్‌లకు వెసులుబాటు కల్పిస్తోందని స్పష్టం చేసింది.
ఈ పాలసీ మూడు దశల ప్రక్రియ ద్వారా అమలు చేయనున్నారు. మొదటి దశలో నాన్-కంప్లైంట్ ఉద్యోగులతో ప్రైవేట్ సంభాషణను కలిగి ఉండాలి. నిబంధనలు పాటించకపోవడం కొనసాగితే, ఉద్యోగి కార్యాలయానికి తిరిగి రావడానికి నిరాకరిస్తే, రెండవ సమావేశాన్ని 1-2 వారాల సమయ వ్యవధిలో నిర్వహించాలి. మేనేజర్‌లు వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయానికి తిరిగి రావాలనే ఉద్యోగ ఆవశ్యకతను ఈ సమావేశంలో నొక్కిచెప్పాల్సి ఉంటుంది. క్రమశిక్షణా చర్యలకు ఇది దారితీయెుచ్చని హెచ్చరించాల్సి ఉంటుంది. చివరిగా హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుంటుంది.
అమెజాన్ మే నెలలోనే తన ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాల్సిందిగా కోరింది. జూలైలో రిమోట్ ఉద్యోగులను ఆఫీసు "హబ్‌ల"కు దగ్గర ప్రాంతాలకు రీలొకేట్ కావాల్సిందిగా సూచించింది. దీనికి ఇష్టం లేని వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ప్యాకేజీని కూడా అందించింది. ఇలా వ్యాపార ప్రతికూలతల మధ్య పరిస్థితులను చక్కబెట్టేందుకు క్రమపద్ధతిలో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు అమెజాన్ కొనసాగిస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications