ఉద్యోగం మానేస్తే రూ.4 లక్షలు ఇస్తున్న యజమాని.. ఇదెక్కడి విడ్డూరం..!!
చాలా కంపెనీలు ఉద్యోగులు ఎక్కడ మానేస్తారోనని వారి వద్ద బాండ్ రాయించుకుంటుంటాయి. ఒకవేళ వారి షరతులను పాటించకుండా జాబ్ మానేయాలనుకుంటే ఎదురు ఉద్యోగి నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాయి.
అయితే ప్రపంచ ప్రఖ్యాత టెక్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. అవును ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లిపోయేందుకు 'పే టు క్విట్' అనే ఒక కార్యక్రమాన్ని బిలియనీర్ జెఫ్ బెజోస్ తీసుకురావటం కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది. ఈ కార్యక్రమం కింద కంపెనీని వీడే ఉద్యోగులకు 1000 డాలర్ల నుంచి గరిష్ఠంగా 5000 డాలర్ల వరకు చెల్లించాలని అమెజాన్ నిర్ణయించింది.

అంటే భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం అమెజాన్ కంపెనీని వీడే ఉద్యోగి గరిష్ఠంగా రూ.4 లక్షలకు పైగా మెుత్తాన్ని అందుకుంటారు. ఒకింత వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఉద్యోగులు కంపెనీని వీడిన తర్వాత వారికి ఆర్థిక పురోగతిని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఈవో జెఫ్ బెజోస్ 2014లో షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో వెల్లడించారు. అమెజాన్ కంటే ముందు Zappos కంపెనీలో కూడా ఈ రకమైన చొరవ తీసుకోబడింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. దీని స్ఫూర్తితో అమెజాన్ కూడా పాటిస్తోంది.
వాస్తవానికి ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల ఆలోచనా ధోరణిని కనుగొనేందుకు సహకరిస్తోంది. ఉద్యోగి డబ్బు తీసుకుని కంపెనీని విడిచిపెట్టాలనుకుంటున్నారా లేదా ఉద్యోగి కంపెనీతో ఎంతకాలం ఉండాలని భావిస్తున్నారనే సమాచారాన్ని అందిస్తుంది. పే టు క్విట్ అనేది ఉద్యోగులు తమ కెరీర్ మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలించేలా ప్రోత్సహించే కార్యక్రమమని సీఈవో బెజోస్ పేర్కొన్నారు. దీని లెక్కన ఉద్యోగం మాసేస్తే కూడా సదరు ఉద్యోగి అమెజాన్ కంపెనీలో లక్షాధికారిగా బయటకు వస్తాడు.


Click it and Unblock the Notifications