ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కు లాక్ డౌన్ కాలం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక ఈ నష్టం భర్తీ చేసుకోవటానికి అమెజాన్ ఒక బంపర్ ఆఫర్ తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లో 'అమెజాన్ పే లేటర్' క్రెడిట్ సర్వీస్‌ని ప్రారంభించిన అమెజాన్ ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.

అర్హత కలిగిన వినియోగదారులకు అమెజాన్ అందిస్తున్న మైక్రో క్రెడిట్ సేవ
అమెజాన్ అందించే ఈ సేవ కేవలం అర్హత కలిగిన వినియోగదారులకు అందిస్తున్న మైక్రో క్రెడిట్ సేవ. ఈ సేవ ఇంతకుముందు కూడా ఈ ఫీచర్ ఎంచుకున్న వినియోగదారులకు వర్తించింది. అయితే సంస్థ ఇప్పుడు దీన్ని ఎక్కువ మంది వినియోగదారులకు విస్తరించింది. అమెజాన్.ఇన్ లో షాపింగ్ చేసే కస్టమర్లకు వర్చువల్ లైన్ క్రెడిట్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు తక్షణ క్రెడిట్ కోసం డిజిటల్ సైన్-అప్ ప్రక్రియ ద్వారా లాగిన్ అవ్వాలి . ప్రక్రియ పూర్తయిన తర్వాత, కస్టమర్ రోజువారీ నిత్యావసరాల నుండి ఎలక్ట్రానిక్స్ మరియు దుస్తులు వరకు దేనినైనా కొనుగోలు చేయగలరు. అమెజాన్ వెబ్‌సైట్‌లో వినియోగదారులు తమ బిల్ చెల్లింపులను పూర్తి చేయడానికి ఈ క్రెడిట్‌ను కూడా ఉపయోగించవచ్చు.

నెల రోజుల్లో తిరిగి చెల్లిస్తే నో ఇంట్రెస్ట్
క్రెడిట్‌ను తిరిగి చెల్లించడానికి కొనుగోలుదారులకు రెండు ప్రధాన ఎంపికలు ఉంటాయి. వడ్డీ లేని క్రెడిట్ వినియోగించుకోవాలనుకునే వినియోగదారులు తదుపరి నెలలో చెల్లింపు చేయవలసి ఉంటుంది. అలా సాధ్యం కాని పక్షంలో వినియోగదారులు నామమాత్రపు వడ్డీ రేట్లతో EMI ల ద్వారా 12 నెలల్లో చెల్లింపు చెయ్యాలి . క్రెడిట్ పరిమితి కస్టమర్ తిరిగి చెల్లించే విధానం మరియు అమెజాన్ లో షాపింగ్ చేసే విధానాలపై ఆధారపడి ఉంటుంది.

కరుర్ వైశ్యా బ్యాంక్ (కెవిబి) రుణ భాగస్వామి
కొత్త లైన్ క్రెడిట్ కస్టమర్ల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రోజువారీ నిత్యావసరాలను ఆర్డర్ చేయడానికి కూడా ఉపకరిస్తుంది . లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత, వినియోగదారులు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయగలరు మరియు విద్యుత్, మొబైల్ రీఛార్జిలు, డిటిహెచ్ మొదలైన వాటికి నెలవారీ బిల్లులు కూడా చెల్లించగలరు. అమెజాన్ పే తన అర్హత కలిగిన కస్టమర్ల కోసం 'అమెజాన్ పే లేటర్' సేవను రూపొందించడానికి మరియు ప్రారంభించడానికి కాపిటల్ ఫ్లోట్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇక దీనికి కరుర్ వైశ్యా బ్యాంక్ (కెవిబి) ను రుణ భాగస్వామిగా ఉంది .

ఎలిజిబిలిటీని బట్టి కస్టమర్ల క్రెడిట్ లిమిట్
ఇక అమెజాన్ పే లెటర్ అమెజాన్ ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్‌కి మాత్రమే ఇది వర్తించనుంది. ఎంపికచేసిన ప్రొడక్ట్స్‌కు డబ్బులు లేకపోయినా 'అమెజాన్ పే లేటర్' ద్వారా వస్తువులు కొనుగోలు చేసి గడువులోగా ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. కస్టమర్ల క్రెడిట్ ఎలిజిబిలిటీని బట్టి రూ.60,000 వరకు అప్పు ఇస్తోంది అమెజాన్. మీరు ఈ సర్వీసును ఉపయోగించుకోవాలనుకుంటే అమెజాన్ ఇండియా యాప్‌లో మొదట రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఒక సిస్టమాటిక్ విధానంలో ఈ ఆఫర్ ను వాడుకునేవారికి ఇది చాలా బెనిఫిట్ అని చెప్పాలి .


Click it and Unblock the Notifications