Fixed Deposit: అమెజాన్‌లో అదిరిపోయే ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) ప్లాన్! లాభం తెలిస్తే అస్సలు వదలరు!
డిజిటల్ పేమెంట్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ పే (Amazon Pay) ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పటివరకు కేవలం రీఛార్జీలు, బిల్లు చెల్లింపులకే పరిమితమైన ఈ యాప్.. ఇప్పుడు తన యూజర్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఇంట్లో కూర్చునే కేవలం కొన్ని క్లిక్స్‌తో మీ పొదుపు మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు.

వడ్డీ రేట్లు ఇలా..
అమెజాన్ పే ఈ సేవలను అందించడానికి దేశంలోని ఐదు ప్రముఖ బ్యాంకులు, రెండు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో (NBFCs) జతకట్టింది. ఇందులో ప్రధానంగా.. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్లైస్ (Slice), శ్రీరామ్ ఫైనాన్స్ అలాగే బజాజ్ ఫైనాన్స్ వంటివి ఉన్నాయి.
ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీరు ఏడాదికి గరిష్టంగా 8% వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఇది అత్యుత్తమ రిటర్న్స్ ఇచ్చే బెస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఆప్షన్‌గా నిలుస్తోంది.
మహిళా ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్!
అమెజాన్ పే మహిళల కోసం ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా డిపాజిట్ చేసే మహిళా ఇన్వెస్టర్లకు సాధారణ వడ్డీ రేటు కంటే అదనంగా 0.5% వరకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే మహిళలు తమ పొదుపుపై మరింత ఎక్కువ లాభాన్ని పొందవచ్చు.
ముఖ్యమైన ఫీచర్లు ఇవే..
- తక్కువ పెట్టుబడి: కేవలం రూ. 1,000 తో కూడా మీరు ఎఫ్‌డీ (FD) ప్రారంభించవచ్చు. చిన్న మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం.
- అకౌంట్ అవసరం లేదు: మీరు ఏ బ్యాంకులోనైతే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో.. ఆ బ్యాంకులో ప్రత్యేకంగా సేవింగ్స్ అకౌంట్ తెరవాల్సిన అవసరం లేదు.
- పూర్తిగా డిజిటల్: పేపర్ వర్క్ లేదు, బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. కేవైసీ (KYC) నుంచి డిపాజిట్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
- భద్రత: బ్యాంకుల ద్వారా చేసే డిపాజిట్లకు ఆర్‌బీఐ (RBI) అనుబంధ సంస్థ DICGC ద్వారా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ రక్షణ ఉంటుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది, NBFCలకు కాదు.
అమెజాన్ పే లో FD ఎలా చేయాలి?
అమెజాన్ యాప్ ఓపెన్ చేసి అమెజాన్ పే (Amazon Pay) సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మీకు 'Fixed Deposit' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకుని మీకు నచ్చిన బ్యాంకును, కాలపరిమితిని (Tenure) , మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ వివరాలు సమర్పించి పేమెంట్ పూర్తి చేస్తే క్షణాల్లో మీ ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
పెట్టుబడిదారులకు గొప్ప అవకాశం!
ప్రస్తుతం ఉన్న అస్థిరమైన మార్కెట్ పరిస్థితుల్లో సురక్షితమైన, ఎక్కువ లాభాన్ని ఇచ్చే వాటిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఒకటి. మంచి FD కోసం వెతుకుతున్న వారికి అమెజాన్ పే ఒక చక్కని వేదిక. పారదర్శకమైన వడ్డీ రేట్లు, సులభమైన దరఖాస్తు ప్రక్రియతో FDని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. మీరు భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటే.. ఇలాంటి FD ఆప్షన్స్ ను ఒకసారి పరిశీలించండి!


Click it and Unblock the Notifications