Amazon 2000 notes: ఇంటి దగ్గరే రూ.2000 నోట్లు మార్చిపెడుతున్న అమెజాన్..! పూర్తి వివరాలు..
Amazon Pay: డీమానిటైజేషన్ తర్వాత దేశంలో రూ.2000 నోట్లను రిజర్వు బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. అయితే వాటిని తీసుకొచ్చిన ప్రయోజనం పూర్తైందంటూ ఇటీవల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
గత కొన్ని ఏళ్లుగా ముద్రణను నిలిపివేయటంతో ఈ నోట్లు పెద్ద మార్కెట్లో కనిపించటం లేదు. పైగా ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో దాచిన సొమ్మును బయటకు తెచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందంటూ అనేక మంది అభిప్రాయపడ్డుతున్నారు. అయితే వీటిని మార్చుకోవటానికి సెప్టెంబరు వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పుడు వీటిని మార్చుకోవటానికి మీరు బ్యాంకుకు కూడా వెళ్లాల్సిన పనిలేదు.

ఉన్న నాలుగు నోట్లను మార్చుకోవటానికి పని మానుకుని బ్యాంకులకు ఏం వెళతాం అనుకునే వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి ఉపసమనం కల్పించేందుకు అమెజాన్ సంస్థ సులువైన పరిష్కారంతో ముందుకు వచ్చింది.
దీని వల్ల మీరు రూ.2000 నోట్లను డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. ఇందుకోసం ఈ-కామర్స్ దిగ్గజం కొత్తగా Amazon Pay క్యాష్ లోడ్ ఎంపికను అందిస్తోంది. ఎండల్లో బయటకు వెళ్లకుండానే.. మీ ఇంటి వద్దే కూర్చుని హాయిగా రూ.2000 నోట్ల మార్పిడిని పూర్తి చేసుకోవచ్చు.
అమెజాన్ తీసుకొచ్చిన ఈ ఎంపిక కింద ఎవరైనా నెలకు రూ.50,000 వరకు నగదును లోడ్ చేయవచ్చు. లోడ్ చేయబడిన డబ్బుతో మీరు ఆన్‌లైన్ కొనుగోళ్లకు చెల్లింపులు చేసుకోవచ్చు. అలాగే స్టోర్‌లలో స్కాన్ & పే ద్వారా డిజిటల్ చెల్లింపులు లేదా బ్యాలెన్స్‌ని ఉపయోగించి Amazonలో షాపింగ్ చేయవచ్చు.
అలాగే లోడ్ చేసుకున్న మెుత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపించుకోవచ్చని అమెజాన్ స్పష్టం చేసింది. ఇందుకోసం డిపాజిట్ చేయాల్సిన డబ్బును డెలివరీ అసోసియేట్‌కు అందిస్తే వారు వెంటనే ఆ మెుత్తాన్ని మీ అమెజాన్ పే ఖాతాలో డబ్బు జమ చేస్తారు.


Click it and Unblock the Notifications