పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. అమెజాన్ మరోసారి లేఆఫ్ లకు సిద్ధమైంది. 18 వేల ఉద్యోగాలు కోత విధించనున్నట్లు అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి మొదటి వారంలో దాదాపు 8 వేల మందికి కంపెనీ ఉద్వాసన పలికింది. తద్వారా తన శ్రామిక శక్తిలో 2 శాతం తగ్గించుకుంది. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే మరోసారి కొరడా ఝళిపించడానికి సిద్ధమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

ఈ-కామర్స్ దిగ్గజైనా తప్పట్లే..
దాదాపు 2 వేల 300 ఉద్యోగాలు కోత విధిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులకు అమెజాన్ హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. అమెరికా, కెనడా, కోస్టారికా నుండి ఉద్యోగులను తగ్గించుకోవడానికి సిద్ధమైంది. ఈ పరిస్థితిల్లో ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ.. లింక్డ్ ఇన్ లో పంచుకుంటున్న వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్ కూ మాంద్యం సెగ:
ఆర్థిక మాంద్యం భయాల కారణంగా టెక్ కంపెనీలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఉద్యోగుల కంట నీరు తెప్పిస్తున్నాయి. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సైతం ఇంజనీరింగ్ విభాగాల్లో దాదాపు 10 వేల ఉద్యోగాల కోతను ప్రకటించి ఆశ్చర్య పరిచింది. కీలకమైన, వ్యూహాత్మక కృత్రిమ మేధ వంటి విభాగాల్లో కొత్తగా నియామకాలు చేపడతామని సీఈవో సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు.

అదే బాటలో మెటా, సేల్స్‌ఫోర్స్..
సేల్స్‌ఫోర్స్, మెటా సహా ఇతర టెక్ బ్రాండ్‌లు సైతం ఇటీవల నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించాయి. సేల్స్‌ఫోర్స్ గతేడాది వందలాది మందికి ఉద్వాసన పలకగా.. రాబోయే రోజుల్లో మొత్తం 10 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు ప్రకటించింది. మెటా 11 వేల మందిని తొలగించింది.

స్కేలింగ్ బ్యాక్ తప్పదు:
స్కేలింగ్ బ్యాక్ డ్రైవ్ అనేది టెక్ కంపెనీలు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి తీసుకునే చర్యల్లో ఒక భాగం. ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని..కష్టమైనా తప్పనిసరి పరిస్థితిలో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications