Layoff News: కొత్త ఏడాది కోతలు మెుదలెట్టిన జెఫ్‌బెజోస్.. ఏకంగా 35 శాతం మందిపై..
Twitch Layoffs: కొత్త ఏడాది ప్రారంభమై పట్టుమది పదిరోజులు కూడా పూర్తి కాకుండానే కంపెనీలు ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుడుతున్నాయి. దాదాపు ఏడాదికి పైగా ఈ తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే అమెజాన్ యాజమాన్యంలోని లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ Twitch నుంచి ఉద్యోగులను తొలగించాలని జెఫ్ బెజోస్ నిర్ణయించారు. కంపెనీలో పనిచేస్తున్న మెుత్తం ఉద్యోగుల్లో 35 శాతం అంటే దాదాపు 500 మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్విచ్‌ను 2014లో అమెజాన్ కొనుగోలు చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం కంపెనీ నేడు తన తొలగింపుల నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది.

ఇప్పటికే చాలా మంది ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని విడిచిపెట్టారు. గత సంవత్సరం మాజీ ట్విచ్ సీఈవో ఎమ్మెట్ షియర్ అమెజానా స్వాధీనం చేసుకున్న 10 ఏళ్ల తర్వాత పదవికి రాజీనామా చేయటం జరిగింది. అంతేకాకుండా కంపెనీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ కస్టమర్ ఆఫీసర్, చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ తమ పదవులకు రాజీనామా చేశారు. సిబ్బంది కోతలకు కారణం ట్విచ్ నిరంతర నష్టాలే కారణంగా తెలుస్తోంది.
ట్విచ్ దక్షిణ కొరియా మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు డిసెంబర్‌లో కంపెనీ ప్రకటించింది. గతంలోనూ కంపెనీ తన నష్టాలను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగించింది. గత ఏడాది రెండు రౌండ్లలో ఇది జరిగింది. అమెరిజా 2022లో వ్యాపార మందగమనం, ఆర్థిక సంక్షోభం భయాలు, ద్రవ్యోల్బణం వంటి అనేక కారణాల వల్ల దాదాపు 27,000 మంది ఉద్యోగులను పలు దఫాల్లో లేఆఫ్ చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ దిగ్గజాల్లో తొలగింపులు 2024లో కూడా కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications