Amazon: ప్రైమ్ యూజర్ల కోసం అమెజాన్ కొత్త ఫీచర్.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ
Amazon: USలోని తన ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌ల కోసం అమెజాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. సరసమైన లేదా ఉచిత ప్లాన్లతో కూడిన మొబైల్ ఫోన్ సేవను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. ఈ చర్యతో వైర్‌లెస్ పరిశ్రమలోని ప్రస్తుత కీ ప్లేయర్స్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని తెలిపింది. AT&T, T-Mobile, Verizon మరియు Dish వంటి ప్రధాన మొబైల్ క్యారియర్‌లతో అమెజాన్ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు నెలకు 10 డాలర్ల కంటే తక్కువ ధరకే వైర్‌లెస్ ప్లాన్‌లను అందించేలా అమెజాన్ ప్లాన్ చేస్తోంది. తద్వారా మొబైల్ వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ (MVNO) మాదిరిగా స్వంత ధరలను నిర్ణయించే సౌలభ్యం అమెజాన్‌కు లభించనుంది. అమెజాన్ మరియు క్యారియర్‌ల మధ్య ఈ చర్చలు దాదాపు 2 నెలలుగా కొనసాగుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇవి మరికొంత కాలం కొనసాగవచ్చని అభిప్రాయపడింది.

మొబైల్ ఫోన్ సర్వీస్ మార్కెట్లోకి అమెజాన్ ప్రవేశించే అవకాశం ఉందన్న వార్త.. వెరిజోన్, T-మొబైల్ మరియు AT&T షేర్ ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 5 నుంచి 7 శాతం వరకు ఆయా షేర్లలో క్షీణత నమోదైంది. అయితే దీనికి విరుద్ధంగా చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన డిష్ మాత్రం 9 శాతం పెరుగుదల చవిచూసింది.
ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు అదనపు ప్రయోజనాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ అన్వేషిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది, అయితే వైర్‌లెస్ సేవలను అందుబాటులోనికి తీసుకొచ్చే తక్షణ ప్రణాళికలు ప్రస్తుతానికి లేవని వెల్లడించింది. కన్స్యూమర్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ పార్టనర్స్ ప్రకారం.. 2022 చివరి నాటికి అమెజాన్ ప్రైమ్ 168 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నట్లు అంచనా.


Click it and Unblock the Notifications