అమెజాన్ అనేది అందరికీ తెలిసిన ఒక ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్. ఇక్కడ ప్రజలు వారికీ కావలసినది ఆర్డర్ చేయవచ్చు. మీకు అవసరమైన ప్రతిదాన్ని కూడా మీ ఇంటి వద్దకే అందించే అమెజాన్ ఎన్నో ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తుంటుంది. అందుకే అమెజాన్ నేటికీ అంతగా ఫెమస్ అయ్యింది. ఇప్పుడు ప్రజలు అమెజాన్‌లో క్రెడిట్ కార్డు పొందవచ్చు.అమెజాన్ కో-బ్రాండెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ నుండి ఈ క్రెడిట్ కార్డును అందిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి కస్టమర్లు చేసే ఏ కొనుగోలుపైనైనా వారికి ఆఫర్లు అందిస్తుంది. అయితే కస్టమర్లు ముందుగా దీనికి అప్లయ్ చేసుకోవాలి. అప్లయ్ చేసుకునే ముందు కస్టమర్లు ప్రయోజనాలను తెలుసుకోవడం మంచిది.
అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు:
*అమెజాన్ ప్రైమ్‌లో 3 నెలల ఉచిత సభ్యత్వం
*అమెజాన్ షాపింగ్ పై రూ.200 డిస్కౌంట్
* విద్యుత్ బిల్లు చెల్లింపుపై 20% క్యాష్‌బ్యాక్
*ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై 50% క్యాష్‌బ్యాక్
*పోస్ట్‌పెయిడ్ బిల్ చెల్లింపులపై 25% క్యాష్‌బ్యాక్
*DTH రీఛార్జ్‌లపై 25% క్యాష్‌బ్యాక్
* బ్రాడ్‌బ్యాండ్ బిల్లు చెల్లింపులపై 50% క్యాష్‌బ్యాక్
*గ్యాస్ సిలిండర్ చెల్లింపులపై 10% క్యాష్‌బ్యాక్
*EazyDiner Primeలో 1 నెల ఉచిత సభ్యత్వం.

క్యాష్‌బ్యాక్ ఎంతంటే ?
* అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 5% క్యాష్‌బ్యాక్, ప్రైమ్ కాని కస్టమర్లకు కొనుగోళ్లపై 3% క్యాష్‌బ్యాక్
*విమాన & హోటల్ బుకింగ్‌లపై ప్రైమ్ సభ్యులకు 5% క్యాష్‌బ్యాక్, ప్రైమ్ కాని వినియోగదారులకు 3% క్యాష్‌బ్యాక్
*గిఫ్ట్ కార్డ్‌లు & ఇ-బుక్‌లపై 2% క్యాష్‌బ్యాక్
*Amazon Pay వ్యాపారులకు 2% క్యాష్‌బ్యాక్
*అమెజాన్ కాని వ్యాపారులకు 1% క్యాష్‌బ్యాక్
*అంతర్జాతీయ లావాదేవీలపై 1% క్యాష్‌బ్యాక్
అదనపు ప్రయోజనాలు
*ఇందులో చేరడానికి ఎలాంటి ఫీజు లేదు
*భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్లలో 1% సర్‌చార్జ్ మినహాయింపు
*రూ. 3,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై 3-6 నెలల పాటు నో-కాస్ట్ EMI.
Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ కోసం ప్రమాణాలు:
*18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
*ICICI బ్యాంక్ కస్టమర్లు కనీసం రూ.25,000 ప్రతినెల ఆదాయం ఉండాలి.
*మీరు ICICI బ్యాంక్ కస్టమర్ కాకపోతే మీకు కనీసం రూ.35,000 ప్రతినెలా ఆదాయం ఉండాలి.
క్రెడిట్ కార్డుకు అవసరమైన డాకుమెంట్స్:
అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డ్ (తప్పనిసరి), ఆదాయ రుజువు (ఏదైనా): పే స్లిప్‌లు, మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
క్రెడిట్ కార్డు కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలి: ముందుగా మీరు ICICI వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 'products' కింద 'అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్' పేజీకి నావిగేట్ చేయండి. ఇప్పుడు apply now పై క్లిక్ చేయండి. మీ అర్హతను వెరిఫై చేయడానికి దరఖాస్తును కొనసాగించడానికి మిమ్మల్ని Amazon వెబ్‌సైట్‌కు మళ్ళిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన వెంటనే డిజిటల్ కార్డు జారీ చేయబడుతుంది. ఆమోదం పొందిన తర్వాత కార్డు కొరియర్ ద్వారా పంపబడుతుంది.
గమనిక: అమెజాన్ అకౌంట్ ఉన్నవారు మాత్రమే అప్లయ్ చేసుకోగలరు. ఈ విధంగా, కస్టమర్లు అవసరమైన క్రెడిట్ కార్డును పొందవచ్చు అలాగే కొనుగోలు చేసే ఉత్పత్తులపై ఆఫర్‌లను పొందవచ్చు.


Click it and Unblock the Notifications