Amazon: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ వ్యాపార సంస్థల్లో ఒకటైన అమెజాన్ ఇటీవల వరుసగా తన వ్యాపారాలను క్లోజ్ చేస్తోంది. మన దేశంలో అమెజాన్.కామ్ కేవలం వారం రోజుల వ్యవధిలో తన మూడవ వ్యాపారాన్ని మూసివేయటం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. భారతదేశంలో వరుసగా తన వ్యాపారాలను కంపెనీ మూసివేయటం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వరుస మూసివేతలు..
నవంబర్ 24న అమెజాన్ అకాడమీని, నవంబర్ 25న అమెజాన్ ఫుడ్‌ను నిలిపివేసింది కంపెనీ. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం దేశంలో ఖర్చులను తగ్గించుకోవటం కష్టతరంగా మారటంతో మరో వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. హోల్‌సేల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ డిస్ట్రిబ్యూషన్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

హోల్‌సేల్ వ్యాపారం..
అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ తాజా నిర్ణయం వల్ల కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, హుబ్లీ నగరాల చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు డిస్ట్రిబ్యూషన్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లు, భాగస్వాములను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని దశలవారీగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

పెట్టుబడులపై క్లారిటీ..
దేశంలో కిరాణా, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, B2B ఆఫర్‌ల వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అమిత్ అగర్వాల్ నేతృత్వంలోని అమెజాన్ ఇండియా.. దాదాపు దశాబ్దపు కార్యకలాపాల్లో లాభదాయకతను పొందడం చాలా కష్టమైంది. భారతదేశంలో అమెజాన్ ఇప్పటి వరకు 6.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టబడింది. అయితే లాభదాయకత అస్పష్టంగానే ఉండటంతో ఇటీవల సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో 9-5 షెడ్యూల్ అంటే ఇదే.. సోషల్ మీడియాలో టెక్కీ షేర్ చేసిన రియాలిటీ!

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

పిల్లలకు సోషల్ మీడియా బంద్! ఆ రాష్ట్రంలో సంచలన నిర్ణయం!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications