Swiggy Instamart: వేగంగా పెరుగుతున్న భారత క్విక్ కామర్స్ మార్కెట్లోకి ఇప్పటికే పెద్ద ఆటగాళ్లు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జెప్టో, టాటా బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటో సహా మరికొందరు తమ వ్యాపారాలను నిమిషాల్లో డెలివరీ పేరుతో కొనసాగిస్తున్నారు.
ఇలాంటి సమయంలో అమెరికాకు చెందిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో తన క్విక్ కామర్స్ వ్యాపారానికి సంబంధించిన సంభావ్య ఒప్పందం కోసం స్విగ్గీని సంప్రదించిందని ఇన్‌స్టామార్ట్ వర్గాలు చెప్పినట్లు నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్‌గా కొనసాగుతున్న స్విగ్గీ ఇప్పటికే రూ.10,400 కోట్ల ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసిన క్రమంలో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రస్తుతం అమెజాన్ కొనసాగుతున్న ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ సమయంలో వాటాను కొనుగోలు చేయడం లేదా ఇన్‌స్టామార్ట్ కోసం కొనుగోలును ప్రతిపాదించడంపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఇలాంటి ప్రయత్నాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. చర్చలు ముందుకు సాగడానికి సీటెల్‌లోని అమెజాన్ ప్రధాన కార్యాలయం నుంచి వేగవంతమైన చర్య అవసరమని మూలాలు సూచించాయి. ఒప్పందం సంక్లిష్టమైన నిర్మాణం కారణంగా ముందస్తు చర్చలు లావాదేవీకి దారితీయకపోవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్విగ్గీ తన క్విక్ కామర్స్ వ్యాపారాన్ని మాత్రమే అమెజాన్ కు విక్రయించబోదని తెలుస్తోంది. ఇదే క్రమంలో వృద్ధి మందగిస్తున్న ఫుడ్ డెలివరీ మార్కెట్‌పై అమెజాన్ ఆసక్తి చూపడం లేదని సమాచారం. అయితే ప్రస్తుతం స్టార్టప్ సంస్థ స్విగ్గీ విలువ మెుత్తం 10-12 బిలియన్ డాలర్లు ఉన్నందున కంపెనీని పూర్తిగా కొనే అవకాశాలు కనిపించటం లేదని తెలుస్తోంది. ఇది ఖరీదైన డీల్ గా ఉన్నందున, అమెజాన్ సాధారణంగా మైనారిటీ వాటాలను తీసుకోదు.
అయితే రూ.1.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉన్న ప్రత్యర్థి జోమాటోకు స్విగ్గీ గణనీయమైన తగ్గింపు ధరను అందజేస్తుందని భావిస్తున్నారు. ఏప్రిల్‌లో గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక జొమాటో క్విక్ కామర్స్ వ్యాపారం Blinkit విలువను 13 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ప్రస్తుతం అమెజాన్ ఇండియా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఆసక్తి భారతదేశంలో క్విక్ కామర్స్ వ్యాపారం అభివృద్ధి చేయడానికి దాని ప్రయత్నాలకు అనుగుణంగా ఉందని తెలుస్తోంది. అమెజాన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మార్కెట్‌లోనూ ఈ సేవను అందించనందున, త్వరిత డెలివరీల కోసం ప్రత్యేక నిలువుగా ప్రారంభించడం కోసం ప్రపంచ ఆమోదం అవసరం.


Click it and Unblock the Notifications