ముంబై: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగాల్లోకి మరో భారీ పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలో గూగుల్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్‌లో అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చర్చలు సఫలమైతే పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తాయని అంటున్నారు. జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీలు ఇండియాలో జట్టు కట్టే అవకాశం కనిపిస్తోంది.

9.9 శాతం వాటా కొనుగోలుకు చర్చలు
రిలయన్స్ రిటైల్ విభాగంలో అమెజాన్ 9.9% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. జియో మార్ట్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలుకు అమెజాన్ ఆసక్తి చూపిస్తోందట. మే నెలలో వాల్‌మార్ట్, అమెజాన్‌లకు పోటీగా రిలయన్స్ జియోమార్ట్‌ను ప్రారంభించింది. ఇండియాలో చిన్న కిరాణా నెట్ వర్క్స్‌కు చేరుకోవడం కోసం జియో మార్ట్ సాంకేతికతను వినియోగిస్తోంది. అమెజాన్ కూడా స్మార్ట్ స్టోర్స్ సదుపాయాన్ని ప్రారంభించింది. జియో మార్ట్ తమ కస్టమర్లకు వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఫీచర్‌ను క్రమంగా అన్ని నగరాలకు విస్తరిస్తోంది.

గతంలోనే ముఖేష్ అంబానీ వ్యాఖ్యలు
అమెజాన్, రిలయన్స్ రిటైల్ మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో రిలయన్స్ రిటైల్‌లో వాటాలు విక్రయిస్తామని ముఖేష్ అంబానీ ఇదివరకే చెప్పారు. ఈ ఊహాగానాలకు అంబానీ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నట్లుగానే భావిస్తున్నారు. రిలయన్స్ రిటైల్‌లో వాటాల కొనుగోలుకు వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని గతవారంలో నిర్వహించిన షేర్ హోల్డర్స్ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు.

ఫ్యూచర్ రిటైల్.. పరస్పర ప్రయోజనం
కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే రిలయన్స్ ఆసక్తిగా ఉంది. వచ్చే నెలలో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్‌కు ఇప్పటికే వాటా ఉంది. ఫ్యూచర్ రిటైల్ ప్రమోటింగ్ కంపెనీ ఫ్యూచర్ కూపన్స్‌లో 49% వాటాను గత ఏడాది అమెజాన్ కొనుగోలు చేసింది. ఇందులో మెజార్టీ వాటా కోనుకోలుపై అమెజాన్‌కు ఆసక్తి లేకుంటే రిలయన్స్ దక్కించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పరస్పర ప్రయోజనం కోసం.. అలాగే, జెఫ్ బెజోస్‌కు రిలయన్స్ రిటైల్ వాటా ఆఫర్ ద్వారా మంచి ప్రతిఫలం కోసం ముఖేష్ అంబానీ చూస్తున్నారని భావిస్తున్నారు. అలాగే జియో మార్ట్ సేవలు ఉపయోగించుకునేందుకు అమెజాన్‌కు కూడా అవకాశం ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications