Amazon Prime Day Sale 2024: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. వాటి భారీగా తగ్గింపు..!

అమెజాన్ వార్షిక ప్రైమ్ డే సేల్ ఈ సంవత్సరం జులై 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ లో iQOO Neo 9 Pro, OnePlus 12, iPhone 13, మరిన్ని పరికరాలపై తగ్గింపులు అందించనున్నారు. ఈ సేల్ జులై 20 మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమవుతుంది. జూలై 21 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. ఈ సేల్ లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్‌లపై ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చెల్లింపు చేసేటప్పుడు అమెజాన్ 10% తగ్గింపును అందిస్తోంది.

ప్రైమ్ డే సేల్ సందర్భంగా విడుదల చేసిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో సామ్ సాంగ్ గెలాక్సీ M35 5G, ఐకూ Z9 Lite 5G, మోటరోలా razr 50 Ultra, లావా బ్లేజ్ X ఉన్నాయి. రెడ్ మీ13 5G, వన్ ప్లస్ నోర్డ్ CE 4 లైట్, రియల్ మీడ GT 6T 5G, వన్ పల్స్ 12R కొత్త వేరియంట్‌లు కూడా రానున్న సేల్‌లో విడుదల కానున్నాయి. ప్రైమ్ డే సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత ఐ ఫోన్ 13 రూ.47,999 ధరకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది.

Amazon has announced huge discounts on many mobiles in the Prime Day sale

అయితే ఈ తగ్గింపు ధరలో ఐఫోన్ 13 ఏ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంటుందో ఇ-కామర్స్ దిగ్గజం వెల్లడించలేదు. సామ్ సాంగ్ గెలాక్సీ S23 అల్ట్రా కూపండ్ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత రూ.74,999 ధరకు అందుబాటులో ఉంటుంది. అయితే 12 నెలల వరకు నో కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంటుంది. సామ్ సాంగ్ గెలాక్సీS21 FE బ్యాంక్ ఆఫర్, 6 నెలల నో కాస్ట్ EMI ఎంపికతో సహా రూ.26,999 ధరకు అందుబాటులో ఉంటుంది.

వన్ ప్లస్ 12 ప్రైమ్ డే సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.52,999 ధరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, ఎంపిక చేసిన పరికరాల మార్పిడిపై గరిష్టంగా 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ రూ.12,000 వరకు అదనపు తగ్గింపు ఉంటుంది. వన్ ప్లస్ 12R 16 GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ బ్యాంక్ తగ్గింపు, కూపన్ ఆఫర్‌ల తర్వాత రూ.40,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా అదనంగా రూ5,000 తగ్గింపు, 9 నెలల వరకు నో కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంటుంది.

ప్రైమ్ డే సేల్ సమయంలో iQOO Neo 9 Pro తగ్గింపు ధర ₹29,999కి (బ్యాంక్ ఆఫర్‌లతో సహా) అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ డే సేల్ సమయంలో Realme GT 6T తగ్గింపు ధరతో లభిస్తుందని, ప్రముఖ మిడ్-రేంజ్ పరికరం కోసం కొత్త 'మిరాకిల్ పర్పుల్' కలర్‌వే కూడా ఉంటుందని అమెజాన్ తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+