ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరు బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో పని చేస్తోన్న ముందు వరుస ఉద్యోగులకు వన్ టైమ్ బోనస్‌లు అందిస్తామని తెలిపింది. ఇందుకోసం భారీ మొత్తం వెచ్చిస్తామని అమెజాన్ వెల్లడించింది. దీనిని 'థ్యాంక్యూ బోనస్'గా పేర్కొంది.

రూ.3,775 కోట్లు ఖర్చు
కీలక సమయంలో పని చేసిన ఉద్యోగుల కోసం 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,775 కోట్లు) థ్యాంక్యూ బోనస్ కింద ఖర్చు చేస్తామని అమెజాన్ తెలిపింది. జూన్ వరకు పని చేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఒక్కొక్కరికి సంస్థలో హోదాను బట్టి 150 డాలర్ల నుండి 3,000 డాలర్ల వరకు ఇస్తామని తెలిపింది. మన కరెన్సీలో రూ.11,000 కంటే పై నుండి రూ.2.26 లక్షల వరకు ఇస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్. ప్రతి సంవత్సరం 10 బిలియన్ వస్తువులను వినియోగదారులకు డెలివరీ చేస్తుంది.

ఎవరికి ఎంత ఇస్తారు?
సంస్థలో వారి వారి స్థాయిని బట్టి ఇచ్చే బోనస్ ఉంటుంది. అమెజాన్ పూర్తి సమయం ఉద్యోగులకు, డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్స్ డ్రైవర్లకు 500 డాలర్ల వరకు ఇస్తారు. అంటే దాదాపు రూ.37,000 కంటే పైన పొందుతారు. పార్ట్ టైమ్ ఉద్యోగులు లేదా డ్రైవర్లు 250 డాలర్లు, అమెజాన్, హోల్ ఫుడ్స్ ఫ్రంట్ లైన్ లీడర్స్‌కు 1,000 డాలర్లు, కస్టమర్లకు ప్యాకేజీ అందించే డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్ ఓనర్స్ 3,000 డాలర్లు, జూన్ వరకు రోజుకు 10 గంటలకు పైగా పని చేసిన అమెజాన్ ఫ్లెక్స్ డ్రైవర్లకు 150 డాలర్లు అందిస్తారు.

అందుకే ఇస్తున్నాం
మా ఫ్రంట్ లైన్ ఆపరేషన్ టీమ్స్ కరోనా వైరస్ వంటి కీలక సమయంలో కొద్ది నెలలుగా అహర్నిషలుశ్రమిస్తున్నాయని, అందుకు తాము వారికి ఏకకాల బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది.

పెరిగిన ఆన్ లైన్ బుకింగ్స్
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటి నుండి ఆన్ లైన్‌లో బుక్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అమెజాన్ సేల్స్ పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో అమెజాన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సంస్థ తన ఉద్యోగుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోందా, బౌతిక దూరం పాటిస్తోందా, మాస్కులు, శానిటైజర్ల వినియోగం, ఆరోగ్య తనిఖీలు చేపడుతోందా అని అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టింది కూడా. అలాగే, ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications