మాంద్యం ముంచుకొస్తోందని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ హెచ్చరించాడు. ఖర్చును తగ్గించుకునే కొన్ని చిట్కాలు కూడా చెప్పారు. ఈ బిలియనీర్ వినియోగదారులు తమ నగదును సురక్షితంగా ఉంచుకోవాలని,సెలవు కాలంలో అనవసరమైన ఖర్చులను నివారించాలని సూచించారు.CNNకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, బెజోస్ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉన్నందున రిఫ్రిజిరేటర్లు లేదా సరికొత్త కార్ల వంటి వస్తువులను కొనుగోలు చేయకూడదని అమెరికన్ కుటుంబాలకు సిఫార్సు చేశారు.

టీవీ
" మీరు పెద్ద స్క్రీన్ టీవీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, దాన్ని విరమించుకోండి. ఆ నగదును ఉంచుకోండి. ఏమి జరుగుతుందో చూడండి. రిఫ్రిజిరేటర్, కొత్త కారు, ఏదైనా సరే తీసుకునే ముందు ఆలోచించండి రిస్క్ ఆఫ్ ది టేబుల్" అని బెజోస్ చెప్పారు. చిన్న-వ్యాపార యజమానులు కొత్త పరికరాలలో పెట్టుబడులను నిలిపివేయాలని, బదులుగా వారి నగదు నిల్వలను పెంచుకోవాలని సూచించారు.ఈ వారం ప్రసారమైన CNN ఇంటర్వ్యూలో బెజోస్ పై వ్యాఖ్యలు చేశారు.

ప్రజహిత కార్యక్రమాలకు
బెజోస్ తన జీవితకాలంలో తన $124 బిలియన్ల నికర విలువలో ఎక్కువ భాగాన్ని ప్రజహిత కార్యక్రమాలకు ఇస్తానని చెప్పాడు. వాతావరణ మార్పులపై పోరాడటానికి, లోతైన సామాజిక, రాజకీయ విభజనల నేపథ్యంలో మానవాళిని ఏకం చేయగల వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి తన సంపదలో ఎక్కువ భాగాన్ని వెచ్చిస్తానని తెలిపారు. బెజోస్ ప్రస్తుతం అమెజాన్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్‌గా కొనసాగుతున్నారు, ఆండీ జాస్సీ CEO పగ్గాలను చేపట్టడంతో గత సంవత్సరం ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కు మారారు.

ఉద్యోగుల తొలగింపు
ట్విటర్, మెటా, లిఫ్ట్ వంటి టెక్ కంపెనీలు USలో అధిక వడ్డీ రేట్లుతో పాటు ఖర్చును తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తుంది. ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో, రెండు వారాల క్రితం అమెజాన్ హైరింగ్ ఫ్రీజ్‌ను ప్రకటించింది. US రిటైల్ దిగ్గజం మూడవ త్రైమాసికంలో దాని నికర లాభం సంవత్సరానికి 9% పడిపోయింది.


Click it and Unblock the Notifications