ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు ఈ కామర్స్ కంపెనీలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ అయినా... ఇండియాలో పుట్టి అమెజాన్ కు గట్టి పోటీ ఇస్తున్న ఫ్లిప్ కార్ట్ అయినా రెండు నెలలుగా అమ్మకాలు లేక చతికిల పడ్డాయి. మార్చి చివర వారం నుంచి మొదలైన లాక్ డౌన్ అంతకంతకూ పెరుగుతూనే పోతోంది. ఇప్పుడైతే ఈ నెల 17 తో ముగుస్తుందని చెబుతున్నా... తప్పనిసరిగా లాక్ డౌన్ ఎత్తివేస్తారని గారంటీ లేదు.
ఇటీవలి మీడియా రిపోర్ట్స్ బట్టి చూస్తే లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి అమెజాన్ అమ్మకాలు సుమారు 90% పడిపోయాయి. ఫ్లిప్ కార్ట్ విషయంలోనూ ఇంతకంటే మెరుగైన పరిస్థితి ఏమీ లేదు. లాక్ డౌన్ సమయంలో కేవలం కూరగాయలు, గ్రోసరీ సరుకులను మాత్రమే సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతించడంతో బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్ వంటి సంస్థలు కొంత వరకు కార్యకలాపాలు సాగించగలిగాయి. కానీ మిగితా ఈ కామర్స్ కంపెనీల పరిస్థితి దయనీయంగా ఉంది. అయితే, అటు అమెజాన్ కానీ, ఇటు ఫ్లిప్ కార్ట్ కానీ ఈ తాత్కాలిక సంక్షోభానికి వెరవటం లేదు.

కొత్త గిడ్డంగుల లీజు...
కరోనా వైరస్ తో నెలకొన్న సంక్షోభం కేవలం తాత్కాలికమేనని, ఒక సారి లాక్ డౌన్ ఎత్తివేస్తే... తమ బిజినెస్ మళ్ళీ పరుగులు పెడుతుందని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత అధిక బిజినెస్ కు ఆస్కారం ఉందని కూడా అవి అంచనా వేస్తున్నాయట. అందుకే దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్త గిడ్డంగులు (వేర్ హౌసెస్) లీజుకు తీసుకుంటున్నాయట. ఈ వేర్ హౌసెస్ ను ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లు అని కూడా పిలుస్తారు.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, వినియోగదారులు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరుపుతారని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల వాయిదా వేసుకున్న అన్ని ప్రొడక్టులను ఆ తర్వాత కస్టమర్లు బుక్ చేస్తారు కాబట్టి, సేల్స్ ఊహించిన దాని కంటే అధికంగా ఉంటాయన్నది వీటి అంచనా. అందుకే పెరిగే డిమాండ్ కు అనుగుణంగా తగిన గిడ్డంగుల సామర్థ్యం ఉండటం అవసరమని, 10 ఏళ్ళ సుదీర్ఘ కాలానికి వాటిని లీజుకు తీసుకుంటున్నాయి.

30 లక్షల చదరపు అడుగులు...
లాక్ డౌన్ తర్వాత అధిక బిజినెస్ కు ఆస్కారమున్న నగరాల్లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పెద్ద మొత్తంలో స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పూణే, లక్నో, అహ్మదాబాద్, కోయింబత్తూర్ నగరాల్లో వీటిని లీజుకు తీసుకున్నట్లు సమాచారం. అమెజాన్ ఏకంగా 20 లక్షల చదరపు అడుగుల స్థలం గిడ్డంగుల కోసం లీజుకు తీసుకోగా... ఫ్లిప్ కార్ట్ 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుందని తెలిసింది.
ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ రెండు కంపెనీలు కూడా 10 ఏళ్ళ కాలపరిమితి వర్తించేలా లీజు అగ్రిమెంట్లు చేసుకున్నట్లు ఈటీ వెల్లడించింది. ఇందులో 5 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే 5 ఏళ్ళ వరకు లీజును రద్దు చేసుకునే అవకాశం ఉండదు.

ఆర్డర్ల వెల్లువ...
దేశంలో గత ఐదేళ్ళలో ఈ కామర్స్ రంగం విపరీతంగా విస్తరించింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగం, దాంతో పాటే స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత .. ప్రజలు ఏదైనా సరే ఫోన్లో కొనుగోలు చేస్తున్నారు. అన్నీ తమ గడప వద్దకే డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నారు. దేశం లో సుమారు 50 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తుండటంతో ఈ కామర్స్ కంపెనీలకు కస్టమర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.
దేశంలో అయితే అమెజాన్ లేకుంటే ఫ్లిప్ కార్ట్ అన్న స్థాయిలో ఈ రెండు కంపెనీలు ఇమేజ్ సంపాదించాయి. 90% నికి పైగా దేశీయ ఈ కామర్స్ రంగం వాటా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లదే కావటంతో వాటికి ఆర్డర్ల వెల్లువ కొనసాగుతోంది. 2020 లో ఇండియా లో ఈ కామర్స్ రంగం 64 బిలియన్ డాలర్ల మార్కెట్ గా అవతరించనుంది. మరో ఏడాదిలో ఇది 80 బిలియన్ డాలర్ల కు చేరుకోనుందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications