Amazon News: అమెజాన్ కంపెనీ గత కొంత కాలంగా తన ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈక్రమంలో అనేక కఠిన నిర్ణయాలను సైతం తీసుకుంది. అయితే ఇవి ఇప్పుడు బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది.
అమెజాన్ గత కొంత కాలంగా భారీగా ఉద్యోగులను తొలగించటం, ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని ఆదేశించింది. అయితే వీటిని వ్యతిరేకిస్తూ దాదాపు 2000 మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ చర్యలకు వ్యతిరేకంగా సీటెల్‌లోని ఉన్న ప్రధాన కార్యాలయం స్పియర్స్ భవనం ముందు వాక్-అవుట్‌లో పాల్గొని నిరసన తెలపాటానికి సిద్ధమౌతున్నారు.

మే 1 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని అమెజాన్ తప్పనిసరి చేసింది. అలాగే గత కొంత కాలంగా రెండు రౌండ్లలో దాదాపు 27,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ చర్యలను నిరసిస్తూ దాదాపు 1,816 మంది ఉద్యోగులు ఉద్యోగులు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వాకౌట్ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలో సియాటిల్‌లో 873 మంది ఉన్నారు.
అయితే రిటర్ టూ ఆఫీస్ పాలసీపై కంపెనీ వాదన మరోలా ఉంది. ఎక్కువ మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వచ్చిన మెుదటి నెలలో తాము సంతోషంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. మరింత ఎనర్జీ, కొలాబరేషన్, కనెక్షన్స్ పెరుగుతున్నాయని తెలిసిందని పేర్కొన్నారు. అలాగే ఈ ట్రాన్సిట్ సాధ్యమైనంత సున్నితంగా చేయడానికి కంపెనీలో చాలా బృందాలు కృషి చేస్తున్నాయన్నారు. అమెజాన్ సీటెల్ ప్రాంతంలో 65,000 కంటే ఎక్కువ మంది కార్పొరేట్ ఉద్యోగులను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications