వాషింగ్టన్: టాప్ ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీ, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న జెఫ్ బెజోస్.. సంచలన ప్రకటన చేశారు. అమెజాన్ నుంచి తప్పుకోబోబోతున్నట్లు వెల్లడించారు.. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అమెజాన్‌లో అన్ని రకాల బాధ్యతల నుంచి ఆయన వైదొలగబోతోన్నారు. తన వారసుడిని కూడా ఖరారు చేశారు. ఆయన పేరును ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎవరీ కొత్త సీఈఓ ఆండీ జస్సీ..
ఆండీ జస్సీ..తదుపరి పీఈఓగా నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఆండీ.. అమెజాన్ వెబ్ సర్వీసుల విభాగాధిపతిగా పని చేస్తున్నారు. 1994లో అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా ఓ చిన్న స్టార్టప్‌గా ఆవిర్భవించింది.. అమెజాన్. ఆన్‌లైన్ బుక్ స్టోర్‌గా ప్రారంభంలో సర్వీసులను అందించిందా కంపెనీ. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో ఆకాశమే హద్దుగా ఎదిగింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. తాము కొనుగోలు చేసే వస్తువులను ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటికే తెప్పించుకునే సదుపాయాన్ని కల్పించడంతో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సర్వీసులను కోట్లాదిమంది ఆదరించారు.

వ్యూహం అమలులో జెఫ్ బెజోస్ దిట్ట
ఇ-కామర్స్, రిటైల్ మార్కెటింగ్ రంగంలో ఓ సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిందా కంపెనీ. 1996 నుంచీ జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చదివిన జెఫ్ బెజోస్.. క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే అమెజాన్‌ను నెలకొల్పాలరు. ఆ కంపెనీ సర్వీసులు విశ్వవ్యాప్తం కావడానికి ఆయన అనుసరించిన వ్యూహాలు, ప్రణాళికలే కారణం. పదేళ్ల తరువాత కూడా ప్రజలు ఎలాంటి సర్వీసులను కోరుకుంటారనే విషయాన్ని ఆయన ముందుగానే పసిగట్టగలిగారు. దానికి అనుగుణంగా కంపెనీ స్ట్రాటజీని రూపొందించుకోగలిగారు. దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు.

మార్కెటింగ్ మేనేజర్‌గా ఆండీ జస్సీ
ఫలితంగా- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. అన్నీ సవ్యంగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జెఫ్ బెజోస్.. అర్ధాంతరంగా తప్పుకోనున్నట్లు ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అమెజాన్ సంస్థకు కొత్త సీఈఓ నియమితులవుతారని వెల్లడించారు. ఆండీ జస్సీని తన వారసుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసుల హెడ్‌గా పనిచేస్తోన్న ఆండీ జస్సీ 1997లో మార్కెటింగ్ మేనేజర్‌గా అమెజాన్‌లో చేరారు.2003లో అమెజాన్ వెబ్ సర్వీస్‌ను స్థాపించారు. అప్పటి నుంచీ ఆయన ఆ విభాగం చీఫ్‌గా పనిచేస్తున్నారు.

వ్యక్తిగత కారణాల వల్లే..
ఆయన సారథ్యంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని నమ్ముతున్నట్లు బెజోస్ తెలిపారు. తన తరువాత ఆ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తి ఆయనొక్కరేనని పేర్కొన్నారు. 57 సంవత్సరాల వయస్సున్న జెఫ్ బెజోస్.. తాను తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. దానికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన కూడా ఈ ప్రకటనలో పొందుపరచలేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన తప్పుకొంటున్నారని అమెరికన్ మీడియా అభిప్రాయపడుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications