Viral video: 21 లక్షలకే ఇల్లు విక్రయిస్తున్న అమెజాన్.. సోషల్ మీడియాలో వీడియో ట్రెండింగ్..

Amazon houses: ఖర్చులు పెరుగుతన్న కొద్దీ మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అమెరికాలో అయితే గృహాల రేట్లు మోయలేని భారమే. A-Z అన్నీ విక్రయించే ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇలాంటి రియల్ ఎస్టేట్ కష్టాలకు ఓ సొల్యూషన్‌తో ముందుకొచ్చింది. కేవలం 21 లక్షలకే ఇల్లు సొంతం చేసుకోండంటూ ఆఫర్ ఇస్తోంది.

పెద్ద ఇల్లు కట్టించుకునేందుకు తగినంత డబ్బు లేదని చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే ఈ సమస్యకు సృజనాత్మకతతో అమెజాన్ పరిష్కారం చూపిస్తోంది. సాంప్రదాయ గృహాలకు బదులు నివసించడానికి సౌకర్యవంతంగా, అన్ని ప్రాథమిక అవసరాలను తీర్చే విధంగా కొత్త తరహా గృహాలను రూపొందిస్తోంది.

Amazon amazed with innovative house sales

టామ్ వాలెంటినో అనే వ్యక్తి షేర్ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. తాను అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన కొత్త ఇంటి వీడియోను అతడు టిక్‌టాక్‌లో పంచుకున్నాడు. 'నేను ఇప్పుడే అమెజాన్‌లో ఇల్లు కొన్నాను. దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించలేదు' అని దానికి క్యాప్షన్ జతచేశాడు.


ప్రముఖ వెబ్‌సైట్ ప్రకారం.. టెక్నికల్‌గా ఇది 16.5 నుంచి 20 అడుగుల ఎత్తులో ఉండే ఫోల్డ్-అవుట్ ఫ్లాట్‌ప్యాక్ ఫుడ్ షెల్టర్. అయినా దాని ఆన్‌లైన్ లిస్టింగ్ దీనిని ప్రీఫ్యాబ్ 'విల్లా' మరియు ఇండస్ట్రియల్ వేర్‌హౌస్ సొల్యూషన్‌గా పేర్కొంది. వెబ్‌సైట్ లో దాని విలువ 21 లక్షల 37 వేలు. ఇంటి లోపలే షవర్ మరియు టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా సహా బెడ్‌రూమ్‌ ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+