అమెజాన్ ఇండియా మంగళవారం నుండి తన వెబ్‌సైట్, యాప్‌ను వివిధ భారతీయ భాషల్లో అందిస్తోంది. మరింతమంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తున్నట్లు అమెజాన్ ఇండియా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ తెలిపారు. దీంతో కొత్తగా 20 కోట్ల నుండి 30 కోట్ల మంది వినియోగదారులకు సులభంగా ఆన్‌లైన్ షాపింగ్‌ను వినియోగించుకునే అవకాశముందన్నారు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.ఇన్ తాజాగా ఇంగ్లీష్, హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళంలోను సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటికే ఈ పోర్టల్ ఇంగ్లీష్, హిందీలో సేవలు అందిస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో కస్టమర్లకు భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే పండుగల సీజన్ నేపథ్యంలో కోట్లాదిమంది వినియోగదారులను చేరుకునేందుకు దోహదం చేస్తుందని చెబుతోంది.

కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్స్ తెలుసుకోవడం, ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్స్, చెల్లింపులు జరిపేందుకు మార్గం మరింత ఈజీ అవుతుందని అమెజాన్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్ డైరెక్టర్ కిషోర్ తోట అన్నారు. నాలుగు భాషల చేరిక గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్, మొబైల్, డెస్క్‌టాప్‌లో కస్టమర్లు తమకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ సిబ్బందితో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మాట్లాడవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications