Amara Raja: తెలంగాణ ప్రభుత్వంతో అమరరాజా ఒప్పందం.. కొత్త పెట్టుబడులతో ఉపాధి..
Telangana News: విద్యుత్ వాహనాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న తరుణంలో బ్యాటరీ తయారీ రంగంలోని కంపెనీలకు మంచి అవకాశాలు వస్తున్నాయి. దీనిని సధ్వినియోగం చేసుకునేందుకు ఈ రంగంలోని కంపెనీలు కొత్త పెట్టుబడులను పెడుతున్నాయి. తాజాగా అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

కొత్త పెట్టుబడులు..
తెలంగాణలో కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీకి అవసరమైన పరిశోధన, తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రతిపాదిత సౌకర్యం 16 గిగావాట్ గంటల వరకు సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీని, 5 GWh వరకు బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్‌ను కలిగి ఉంటుంది. భవిష్యత్ అవసరాలకోసం కంపెనీ ఇక్కడ మరో రూ.9,500 కోట్లను పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.

ఆధునిక లేబొరేటరీ..
పెట్టుబడుల ద్వారా కంపెనీ తెలంగాణలో మెటీరియల్ రీసెర్చ్, ప్రోటోటైపింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనాలిసిస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డెమోన్‌స్ట్రేషన్ కోసం అధునాతన లేబొరేటరీలు, టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు అనుగుణంగా ఈ హబ్ చాలా అవసరమైన ఉత్ప్రేరకంగా పనిచేయాలని అమర రాజా భావిస్తోంది. అమర రాజా వాణిజ్య స్థాయి పైలట్ ప్లాంట్, మొదటి గిగా స్కేల్ సెల్ ఉత్పత్తి సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది.

అవసరాలకు అనుగుణంగా..
భారతదేశంలోని పరిస్థితులకు ప్రత్యేకంగా సరిపోయే లిథియమ్ అయాన్ సెల్ కెమిస్ట్రీలపై పని చేస్తోంది. ఇప్పటికే కంపెనీ రెండు, మూడు చక్రాల వాహనాలకు అవసరమైన లిథియమ్ బ్యాటరీ ప్యాక్స్, ఛార్జర్‌లను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని పారిశ్రామిక, ఆటోమోటివ్ అప్లికేషన్‌ల కోసం లెడ్-యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీల అతిపెద్ద తయారీదారుల్లో ఒకటిగా కొనసాగుతోంది.

గల్లా జయదేవ్..
తెలంగాణ ప్రభుత్వంతో వ్యూహాత్మక భాగస్వామ్యం అమరరాజాకు పెద్ద ముందడుగని సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ అన్నారు. ఇది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. ఇదే సమయంలో న్యూ ఎనర్జీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని మాట్లాడుతూ కంపెనీ నిర్థేశించుకున్న 'ఎనర్జీ & మొబిలిటీ' రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా తాజా చర్యలు ఉన్నాయని అన్నారు. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్ లాభపడింది. కంపెనీ నికల లాభం రెండవ త్రైమాసికంలో రూ.201.22 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications