'బుక్స్ చదవలేదు, పొద్దునే లేవను': కానీ 20 ఏళ్లలో కోటీశ్వరుడు.. సోషల్ మీడియా వైరల్..
రోజు పొద్దున్నే లేచి చదువుకోవాలి, 18 గంటలు కస్టపడి పని చేయాలి, ఎక్కువగా బుక్స్ చదవాలి, డబ్బు సంపాదించడానికి ఎంతో శ్రమ అవసరం అని చెప్పేవాళ్ళు చాల మంది ఉంటారు. అయితే ఇవ్వని ఏం చేయకుండానే ఈరోజు కోటీశ్వరుడు అయ్యానని చెప్పాడు. అతను ఎవరో కాదు ముంబై నివాసి అమన్ గోయల్ అనే 20 ఏళ్ల యువకుడు. ఇప్పుడు ఇతను గ్రేలాబ్స్ AI సహ వ్యవస్థాపకులు, CEO కూడా. సోషల్ మీడియా ఎక్స్‌లో ఇతని సక్సెస్ గురించి అడుగగా నేను ఎప్పుడూ పుస్తకాలు చదవలేదని, పొద్దున్నే లేచి కష్టపడి పని చేయలేదని చెప్పాడు. అంతేకాదు అతని ఎలాంటి సక్సెస్ ఫార్ములా ఫాలో కాలేదని కూడా పేర్కొన్నాడు.
నేడు పొద్దునే 5 గంటలకు లేవడం, చల్లటి నీటితో స్నానం చేయడం అసలు నేను పుస్తకాలు కూడా చదవడం చేయలేదని తెలిపాడు. లక్షాధికారి, ధనవంతుడు కావడానికి చూపించే ఏ మార్గాలను నేను ఫాలో అవ్వను. అంతెందుకు ఒక వ్యక్తి సక్సెస్ కావడానికి సోషల్ మీడియాలో చెప్పే సక్సెస్ ఫార్ములాలను కూడా అమన్ గోయల్ కొట్టి పారేసారు.

అమన్ గోయల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం అతను 2017 సంవత్సరంలో IIT బాంబే నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసాడు. డిగ్రీ తర్వాత కాగ్నో AIని స్థాపించాడు. ఈ స్టార్టప్‌ని తర్వాత ఎక్సోటెల్ సొంతం చేసుకుంది. అప్పుడు GreyLabs AI, AI సొల్యూషన్స్ కంపెనీని స్టార్ట్ చేసాడు.
అమన్ గోయల్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో నేను మాములుగా ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు లేస్తాను. నేను చివరగా బుక్ ఎప్పుడు చదివానో కూడా నాకు గుర్తులేదు. ఎందులకంటే నేను ఎక్కువగా సోషల్ మీడియా, పాడ్‌కాస్ట్‌ల ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అయితే అతని సక్సెస్ సీక్రెట్ గురించి 3 ఫార్ములాస్ షేర్ చేసారు. ముందుగా మీరు విలువైన, ప్రజలకు అవసరమైన వాటిని క్రియేట్ చేయాలి. అలాగే దానిని కస్టమర్‌లకు అందించాలి. ఇలా మీరు మిలియనీర్ అయ్యే వరకు ఈ విధానాన్ని రిపీట్ చేయాలి.


Click it and Unblock the Notifications