Amazon Layoffs: అమెజాన్ CEO ఆండీ జాస్సీ వాటాదారులకు రాసిన వార్షిక లేఖలో కంపెనీ గడిచిన గందరగోళ సంవత్సరం గురించి ప్రస్థావించారు. ప్లాట్‌ఫారమ్ వృద్ధికి తాను తీసుకున్న ఖర్చు తగ్గింపు, ఇతర చర్యల కారణంగా 27,000 మంది ఉద్యోగులను తొలగించే 'కఠిన నిర్ణయం' తీసుకున్నట్లు వెల్లడించారు. మెుదటి దశలో 18,000 మందిని తొలగించగా.. గత నెలలో రెండవ దశ తొలగింపుల్లో భాగంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించారు.
ఈ క్రమంలో తొలగించబడిన ఉద్యోగులకు పరిహారంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, బయట ఉద్యోగం పొందటానికి మద్ధతును అందిస్తోందని వెల్లడించారు. కంపెనీ దీర్ఘకాలం కొనసాగేలా చూసేందుకు నిర్వహణ ఆదాయం, నగదు ప్రవాహాలు, కంపెనీల పనితీరు గురించి లోతుగా పరిశీలిస్తున్నట్లు జాస్సీ వెల్లడించారు. ఇన్వెస్ట్ మెంట్ పై రాబడి గురించి దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

అమెజాన్ చరిత్రలో ప్రస్తుత తొలగింపులు చాలా పెద్దవి. అయితే కంపెనీకి మంచి రోజులు ముందు రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చులను తగ్గించుకోవటం కోసం అమెజాన్ ఫిజికల్ స్టోర్లను, అమెజానా కేర్, అమెజాన్ ఫ్యాబ్రిక్ లను మూసివేసింది. దీనికి తోడు ఖర్చుల మదింపులో భాగంగా కంపెనీ అనేక ఇతర మార్పులను సైతం చేపట్టింది.

మే మెుదటి వారం నుంచి ఉద్యోగులు కనీసం వారంలో మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీ ప్రకటించింది. ఈ క్రమంలో అమెజాన్ టెక్ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. అమెజాన్ AI పై కంపెనీ దృష్టి పెడుతోంది. కంపెనీ తన సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMలు)పై పని చేస్తోంది. ఇది కస్టమర్ అనుభవాన్ని మారుస్తుందని, మెరుగుపరుస్తుందని జాస్సీ నమ్మకంతో ఉన్నారు. ఇందుకోసం అవసరమైన పెట్టుబడులను కొనసాగిస్తామని జాస్సీ తెలిపారు


Click it and Unblock the Notifications