వీకెండ్ లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 18 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 685పాయింట్ల పెరిగి
79791 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 197 పాయింట్లు వృద్ధి చెంది 24340 ట్రేడవుతోన్నాయి. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హెచ్ సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్, మారుతి, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐటీసీ, భారతి ఎయిర్ టెల్, ఎల్అండ్ టీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్అండ్ టీ, ఎస్బీఐఎన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
యుఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపు సంచలనంపై గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్లు బలంగా ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ స్వల్పంగా పెరిగి 24,143 వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 149 పాయింట్లు పెరిగి 79,105 వద్ద ముగిసింది. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 104 పాయింట్లు దిగజారి 49,727 వద్ద ముగిసింది. కానీ శుక్రవారం సానుకూల వాతావరణంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ శుక్రవారం దాదాపు 10 శాతం పెరిగింది.

HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 56.73 కోట్ల రూపాయల పన్ను నోటీసు వచ్చింద. 49.80 కోట్ల రూపాయలతో పాటు వడ్డీ 5.68 కోట్ల రూపాయల పెనాల్టీతో కట్టాలని ఆగస్టు 14, 2024న చండీగఢ్ వార్డ్ 8లోని కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి కంపెనీకి GST ఆర్డర్‌ను వచ్చింది. దీంతో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ షేర్ ప్రైస్ స్వల్పంగా తగ్గింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక ఉత్పత్తులు, అనుబంధ సేవల పంపిణీ వ్యాపారాన్ని కొనసాగించడానికి జియో ఫైనాన్స్ ప్లాట్‌ఫారమ్, సర్వీస్ పేరుతో పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.
శుక్రవారం ఐటీ స్టాక్ ల్లో ర్యాలీ కనిపిస్తోంది. ఎంఫాసిస్, ఫర్ సిస్టెన్స్, ఎల్అండ్ టీ టెక్నాలజీ, కోఫోర్జ్, ఎల్టీఐ మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడవుతోన్నాయి. నిఫ్టీ టెక్నాలజీ ఇండెక్స్ 1.5 శాతం పెరిగింది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications