Stock Market Open: రాణిస్తోన్న ఐటీ స్టాక్స్.. ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 47 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 97 పాయింట్లు తగ్గి 77450 కోనసాగుతోంది.ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 కోల్పోయి 23584 వద్ద ట్రేడవుతోంది. ఐటీ స్టాక్ లు రాణిస్తున్నాయి. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఇన్ఫోస్సి, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐఎన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాక్, టైటాన్, ఐటీసీ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
ఎల్అండ్ టీ, మారుతి, అల్ట్రాటెస్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందస్థాన్ యూనిలీవర్, హెచ్ డీఎ ఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో ప్రధాన లాభాల్లో ఉండగా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యుఎల్ నష్టపోయాయి.

విదేశీ బ్రోకరేజ్ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ టాటా టెక్నాలజీకి స్టాక్ టార్గెట్ ప్రైస్ ను రూ. 900 గా పేర్కొంది. ఇది జూన్ 18 ముగింపు ధర రూ. 1,029 కంటే 12 శాతం తక్కువ. టాటా టెక్నాలజీస్ ఐపీఓ 2023లో వచ్చింది. CE ఇన్ఫో సిస్టమ్స్ తన ర్యాలీని శుక్రవారం కూడా కొనసాగుతోంది. స్టాక్ శుక్రవారం కూడా భారీగానే పెరిగింది. 10 శాతం పెరిగి.. ఉదయం 10 గంటలకు 7 శాతానికి తగ్గింది. గోల్డ్‌మన్ సాచ్స్ 'కొనుగోలు' రేటింగ్ ఇవ్వడంతో పాటు టార్గెట్ ప్రైస్ రూ. 2,800 ఇచ్చింది. దీంతో జూన్ 20న స్టాక్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.


Click it and Unblock the Notifications