IPO News: రెండు రోజుల్లో 100 రెట్లు దరఖాస్తులు.. గ్రేమార్కెట్ దూకుడు.. ఎగబడుతున్న జనం
Alpex Solar IPO: ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎక్కువగా పునరుత్పాదక విద్యుత్ రంగంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సోలార్ పరికరాలను కోటికి పైగా ఇళ్లకు చేర్చే పనిలో ఉంది. దీంతో ఈ రంగంలోని అనేక కంపెనీల్లో భారీగా ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సోలార్ ఉత్పత్తుల వ్యాపారంలో కొనసాగుతున్న.. ఆల్పెక్స్ సోలార్ కంపెనీ ఐపీవో గురించే. ఐపీవో మెుత్తంగా రెండు రోజుల్లో ఏకంగా 82.88 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఈ క్రమంలో రిటైల్ విభాగంలో 133.86 సార్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగంలో 0.90 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో 73.19 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. ముందుగా మొదటి రోజైన గురువారం నాడు కంపెనీ ఐపీవో 30.85 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ని అందుకుంది.

కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.109-రూ.115 శ్రేణిలో నిర్ణయించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో పెట్టుబడిదారుల కోసం తన పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. ఇందులో పాల్గొనేందుకు ఇన్వెస్టర్లు కనీసం రూ.1,38,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ ఏకంగా రూ.74.52 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం మెుత్తంగా 64.80 తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది.
ఫిబ్రవరి 8న పెట్టుబడిదారుల కోసం ప్రారంభించబడిన ఆల్పెక్స్ సోలార్ ఐపీవో ఫిబ్రవరి 12న ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఇప్పటికీ సోమవారం వరకు ఇన్వెస్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది.
ఇన్వెస్టర్ గెయిన్ ప్రకారం గ్రేమార్కెట్లోకంపెనీ రూ.190 ప్రీమియం కలిగి ఉంది. ఈ లెక్కన ఐపీవో లిస్టింగ్ సమయంలో ఒక్కో షేరు ధర రూ.300 కంటే అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన ఇన్వెస్టర్ల డబ్బు మెుదటిరోజే డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవో ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.21.22 కోట్లను విజయవంతంగా సమీకరించింది.


Click it and Unblock the Notifications